పవన్ సినిమాలపై నాగబాబు కామెంట్స్?

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు  పవన్ పై మెగా ఫ్యామిలీ ఎవరూ కామెంట్స్ చెయ్యలేదు. పవన్ వరసబెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు పవన్ నిర్మాతగా రామ్ [more]

Update: 2020-04-14 09:09 GMT

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు  పవన్ పై మెగా ఫ్యామిలీ ఎవరూ కామెంట్స్ చెయ్యలేదు. పవన్ వరసబెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు పవన్ నిర్మాతగా రామ్ చరణ్ సినిమా అని.. రామ్ చరణ్ నిర్మాతగా పవన్ సినిమా అన్నారు కానీ. ఎక్కడా కంఫార్మేషన్ లేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ పై మెగా నటుడు నాగబాబు హాట్ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం జనసేన పార్టీ భజన చేస్తున్న నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలపై కామెంట్స్ చేసాడు.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విషయాలు తనతో మాట్లాడాడని… వకీల్ సాబ్ హిందీ పింక్ రీమేక్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెలుగు వెర్షన్ లో మార్పులు చేర్పులు చేసారని… ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపిస్తాడని, తనకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే పాత్ర అని.. పవన్ తనతో చెప్పాడంటున్నాడు. ఇక క్రిష్ – పవన్ కాంబో లో తెరకెక్కబోయే  సినిమా కథపై రకరకాల న్యూస్ లు ప్రచారం లో ఉన్నాయి. మొఘలాయిలా కాలంలో కోహినీర్ వజ్రం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా ఉంటుంది అని.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నాడు నాగబాబు. నాగబాబు పవన్ సినిమాలపై మాట్లాడేసరికి పవన్ ఫాన్స్ కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది.

Tags:    

Similar News