బాలకృష్ణ ఓ పెద్ద కమెడియన్..!

Update: 2018-12-10 09:42 GMT

పవన్ మీద ప్రేమతో మెగా హీరో నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలియదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో యంకర్ అడిగిన ఒక ప్రశ్నకు నాగబాబు... బాలయ్య బాబు ఎవరో తెలియదని చెప్పడం... పాత తరం కమెడియన్ బాలకృష్ణ తెలుసనీ చెప్పడంతో.. బాలయ్య ఫ్యాన్స్ గత రెండు రోజులుగా నాగబాబుపై ఫైర్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ బాలయ్య ఎవరో తెలియదని చెప్పిన నాగబాబు కనబడితే కొట్టేటట్టుగా ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్. మరి తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం చెలరేగుతున్నప్పటికీ.. నాగబాబు మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు.

ఫైర్ అవుతున్న బాలయ్య ఫ్యాన్స్...

ప్రస్తుతం చేతిలో సినిమాలు లేని నాగబాబు కావాలనే ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నాడా..? లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ పిలిచి జనసేనలో పెద్దపీట వేస్తాడని అనుకుంటున్నాడేమో అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో నాగబాబుని ఒక ఆట ఆడుకుంటున్నారు. బాలయ్య అభిమానులను నాగబాబు కావాలనే కెలుక్కుంటున్నాడని... ఇలా చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఇక తాజాగా నాగబాబు మరోమారు ఫేస్ బుక్ లో బాలయ్యని, ఆయన అభిమానులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు.

ఆయనో పెద్ద కమెడియన్

నాగబాబు తాను ఏం అనుకుంటున్నాడనేది ఒక వీడియో రూపంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. బాలయ్య ఎవరో తెలియదు అనడం పెద్ద పొరబాటని.. తనని క్షమించండని... ఒక తప్పిదం దొర్లిందని.. బాలకృష్ణ గారు తెలియదని మాట్లాడడంతో కొద్దిమంది సన్నిహితులు తనని హెచ్చరించారని చెప్పాడు నాగబాబు. నాగబాబు మాట్లాడుతూ... ‘‘బాలకృష్ణ గారు తెలియకుండా ఎవరుంటారండీ.. ఆయన పెద్ద కమెడియన్... ఆయనో మంచి నటుడు.. ఆయన హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది... అలాంటి హాస్యనటుడు బాలకృష్ణ గారిని తెలియదని అనడం నిజంగా నా తప్పు. ఎన్టీఆర్ గారితో పనిచేసిన వల్లూరి బాలకృష్ణ గారు... కృష్ణ గారి అసాద్యుడిలో కూడా నటించాడు. వల్లూరి బాలకృష్ణ గురించి వికీపీడియాలో కొడితే సమగ్రంగా తెలుస్తుంది.. ప్రస్తుతం ఆయన మన మధ్యన లేరు.. కొన్నాళ్ల క్రితం ఆయన మరణించారు..’’ అంటూ వల్లూరి బాలకృష్ణ ఫొటోతో సహా నాగబాబు ఫేస్ బుక్ వీడియో లో పోస్ట్ చేశాడు. దీంతో బాలయ్య బాబు అభిమానులను నాగబాబు కావాలనే కెలుక్కున్నాడు. మరి ఈ రచ్చ ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

Similar News