నాగ బాబు రీ ఎంట్రీ అదుర్స్

జ‌బ‌ర్ద‌స్త్‌…ఈ షో కి తెలుగు స్టేట్స్ లో ఎంత పాపులారిటీ వచ్చిందో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో కి [more]

Update: 2019-06-07 06:26 GMT

జ‌బ‌ర్ద‌స్త్‌…ఈ షో కి తెలుగు స్టేట్స్ లో ఎంత పాపులారిటీ వచ్చిందో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో కి టిఆర్పి రేటింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఇందులో యాక్ట్ చేసేవాళ్లు ఎంత ఫేమసో జడ్జిలు కూడా అంతే ఫేమస్. ఈ షో స్టార్ట్ అయినా దగ్గర నుండి జడ్జిలు గా నాగ బాబు అండ్ రోజానే ఉన్నారు.

ఈమధ్య ఆంధ్ర లో ఎన్నికలు జరిగిన కారణంగా ఇద్దరు తమతమ పార్టీస్ తో బిజీ అయిపోయారు. రాజ‌కీయ వేడిలో ఇద్దరు రెండు నెలలు పాటు ఈ షో కి దూరంగా ఉన్నారు. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తరువాత వెంటనే రోజా వచ్చేసారు కానీ నాగ బాబు చాల టైం తీసుకున్నారు. ఏదైతేనేం నాగ‌బాబు మ‌ళ్లీ త‌న సొంత గూటికి వ‌చ్చేసాడు. ఈసారి మరింత రీ ఫ్రెషింగ్‌గా క‌నిపించాడు మెగా బ్ర‌ద‌ర్.

అంతకముందు నాగబాబు ప్లేస్ లో ఆలీ వ‌స్తుండ‌టంతో నాగ‌బాబుకు పూర్తిగా చెక్ ప‌డిపోయిన‌ట్లే అని అనుకుంటున్న అభిమానుల‌కు ఇప్పుడు మ‌ళ్లీ క‌ళ వ‌చ్చింది. పాత జడ్జిల‌ను చూడ‌టంతో షో రేటింగ్ మ‌ళ్లీ పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈవారం రిలీజ్ అయినా ప్రోమో లో నాగ బాబు కనిపించరు. అంటే నెక్స్ట్ వీక్ లో నాగ బాబు ఎంట్రీ ఉండనుంది

Tags:    

Similar News