బాలయ్యతో కావాలనే పెట్టుకుంటున్నారా..?

నందమూరి బాలకృష్ణతో మెగా బ్రదర్ నాగబాబు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. అంతకుముందు ఏం జరిగిందో కానీ ఇటీవలి నాగబాబు వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఓ [more]

Update: 2018-12-26 09:55 GMT

నందమూరి బాలకృష్ణతో మెగా బ్రదర్ నాగబాబు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. అంతకుముందు ఏం జరిగిందో కానీ ఇటీవలి నాగబాబు వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘బాలయ్య’ ఎవరో తనకు తెలియదని నాగబాబు సమాధానం ఇచ్చారు. అది సోషల్ మీడియాలో చర్చ జరిగి, బాలయ్య అభిమానులు మండిపడ్డా నాగబాబు వెనక్కి తగ్గలేదు. పైగా అలనాటి హాస్య నటుడు బాలయ్య తనకు తెలుసని చెప్పి మరీ కయ్యం కాజేశారు. ఇప్పడు నాగబాబు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో కూడా బాలకృష్ణను ఉద్దేశించి వెక్కిరింతగా పెట్టినట్లుగా ఉంది.

బాలయ్యను ఉద్దేశించేనా…

ఓ చిన్న పిల్లాడు ‘సారే జహాసే అచ్చా’ గీతాన్ని అద్భుతంగా పాడుతున్న వీడియోను నాగబాబు పోస్ట్ చేశారు. ఇది కూడా బాలకృష్ణను ఉద్దేశించే చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో బాలకృష్ణ ప్రచారం సందర్భంగా ‘సారే జహాసే అచ్చా’ సరిగ్గా పాడలేక ‘బుల్ బుల్ బాలయ్య’గా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించే నాగబాబు ఈ వీడియో పోస్ట్ చేసినట్టున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఏం జరిగిందో మాత్రం తెలియడం లేదు.

Tags:    

Similar News