నాగశౌర్య – అవసరాల సినిమా టైటిల్ అదిరింది..!

నాగశౌర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘నర్తనశాల’ డిజాస్టర్ తరువాత ఇప్పుడిప్పుడే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు శౌర్య. ప్రస్తుతం అతను వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. నందినీరెడ్డితో [more]

Update: 2019-03-12 08:28 GMT

నాగశౌర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘నర్తనశాల’ డిజాస్టర్ తరువాత ఇప్పుడిప్పుడే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు శౌర్య. ప్రస్తుతం అతను వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. నందినీరెడ్డితో ‘బేబీ’ అనే సినిమా పూర్తయిపోయింది. మరో రెండు సినిమాలతో పాటు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం ఓ డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు.

ఇప్పటికే రెండు హిట్ సినిమాలు

‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. అవసరాల తనదైన స్టయిల్ లోనే అందించబోతున్నారని డిసైడ్ కావచ్చు. అవసరాలతో నాగశౌర్య ఇప్పటికే రెండు సినిమాలు చేసిన అనుభవం ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ రెండు సినిమాలూ డీసెంట్ హిట్స్ అయ్యాయి. ఇక మూడు సినిమా అయిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే అధికారంగా ప్రకటన రానుంది.

Tags:    

Similar News