ఇద్దరి భామల మధ్యలో ఓ యంగ్ హీరో...?

Update: 2018-07-28 05:29 GMT

జగపతి బాబు యాక్షన్ హీరో కన్నా ఎక్కువగా ఇద్దరి పిల్లల ముద్దుల మొగుడు సినిమాల్లోనే అదరగొట్టాడు. ఒకప్పుడు సీనియర్ హీరోల్లో శోభన్ బాబు అలా ఇద్దరు భార్య కథలున్న సినిమాలు చేస్తే... ఆ మధ్య కాలంలో జగపతి బాబు ఇద్దరు భార్యలున్న సినిమాలు చేసేవాడు. ఇక నాగార్జున కూడా ఆవిడా మా ఆవిడే సినిమా తోను మెప్పించాడు. వెంకటేష్ అయితే ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు, బాలయ్య బాబు అయితే నారి నారి నడుమమురారి వంటి సినిమాల్తో మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలెవరు అలాంటి కథలను సెట్ చెయ్యడం లేదు. తాజాగా అలాంటి కథను ఒక కుర్ర హీరో చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

జగపతి బాబు కెరీర్ లో ఆయనకిద్దరు సినిమా ఎంతో ముఖ్యమైన సినిమా. ఈ వి వి సత్యన్నారాయణ తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా కి రీమేక్ చేస్తున్నాడట... టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు. ఛలో సినిమాతో ఫుల్ ఫామ్ లోకొచ్చేసి సినిమాల మీద సినిమాలు చేసేస్తూ.. ప్రస్తుతం నర్తనశాల సినిమా సెట్స్ మీదున్న నాగ శౌర్య ఈ ఆయనకిద్దరు సినిమాలో రీమేక్ లో నటించబోతున్నాడనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. రాజా డైరెక్షన్ లో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమా గతంలో తెరకెక్కిన ఆయనకిద్దరు సినిమాని ఈ ట్రెండ్ కి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి నాగ శౌర్య హీరోగా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరి ఆయనకిద్దరు సినిమాలో రమ్యకృష్ణకి, ఊహ కి మధ్యలో నలిగిపోయే ప్రేమికుడిలా, భర్త గా జగపతి బాబు నటన సూపర్. మరి నాగ శౌర్య పక్కన ఈ ఆయన కిద్దరు సినిమా లో ఏ ఇద్దరు హీరోయిన్స్ నాగ శౌర్య కోసం పోటీ పడతారో అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు రాజా నాగ శౌర్య పక్కన ఆడి పాడబోయే హీరోయిన్స్ ఎంపికలో నిమగ్నమయ్యాడని... నాగ శౌర్య తన ఓన్ బ్యానర్లో చేస్తున్న నర్తనశాల పూర్తికాగానే రాజా డైరెక్షన్ లో ఆయనకిద్దరు సినిమా మొదలవుతుందని సమాచారం.

Similar News