నాగ శౌర్య నెక్స్ట్ మూవీ ఇదే..!

హీరో నాగశౌర్యకు ‘ఛలో’తో సూపర్ హిట్ అందుకున్న తరువాత మ‌నోడికి ఇక‌ తిరుగులేదు.. వరుసబెట్టి సినిమా అవకాశాలు వస్తాయి అని అంతా భావించారు. అనుకున్నట్టుగానే సినిమా అవకాశాలు [more]

Update: 2019-05-05 12:14 GMT

హీరో నాగశౌర్యకు ‘ఛలో’తో సూపర్ హిట్ అందుకున్న తరువాత మ‌నోడికి ఇక‌ తిరుగులేదు.. వరుసబెట్టి సినిమా అవకాశాలు వస్తాయి అని అంతా భావించారు. అనుకున్నట్టుగానే సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే స్టోరీ సెలక్షన్ లో చేసిన తప్పులతో వరుసగా మూడు డిజాస్టర్ లను చవిచూశాడు శౌర్య. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అసలే మనోడికి మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇటువంటి టైంలో మంచి సినిమా పడితే తప్ప కెరీర్ పరంగా శౌర్య సక్సెస్ అవ్వలేడు.

హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితో…

అందుకే కసితో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఇటీవల ఓ సినిమాను మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశాడు. మరి దానికి కారణాలు ఏంటో మాత్రం ఎవరికి తెలియదు. ప్రస్తుతం తనకు ‘ఊహలు గుస గుస లాడే’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్ అవసరాలతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కొన్ని నెలల్లో స్టార్ట్ అవ్వనుంది. ఈ చిత్రంతో పాటు శౌర్య మరో సినిమా కూడా ఓకే చెప్పాడట. ఇది వచ్చే వారం సెట్స్ మీదకు వెళ్లనుంది. దీన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడని సమాచారం. శౌర్య ఓన్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Tags:    

Similar News