నాగ శౌర్య కొత్త సినిమా ఆగిపాయింది

హీరో నాగ శౌర్య గత ఏడాది ఛలో చిత్రం సూపర్ హిట్ అందుకుని ఆ తరువాత రెండు డిజాస్టర్స్ చవి చూసాడు. ప్రస్తుతం శౌర్య క్యారెక్టర్ ప్రాధాన్యతను [more]

Update: 2019-03-24 10:40 GMT

హీరో నాగ శౌర్య గత ఏడాది ఛలో చిత్రం సూపర్ హిట్ అందుకుని ఆ తరువాత రెండు డిజాస్టర్స్ చవి చూసాడు. ప్రస్తుతం శౌర్య క్యారెక్టర్ ప్రాధాన్యతను బట్టి హీరొయిన్ ఓరియంటెడ్ మూవీస్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. లేటెస్ట్ గా సామ్ నటిస్తున్న ఓ బేబీ అనే సినిమాలో సైతం నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా కొద్దిరోజుల్లో కిందట స్టార్ట్ అయినా రాజ కొలుసు అనే కొత్త దర్శకుడు మూవీ క్యాన్సిల్ అయినట్టు ఫిలిం నగర్ టాక్. భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈచిత్రం ఆగిపోయింది. హీరోకు నిర్మాతకు ఏవో అంతర్గత విభేదాల వల్ల ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఆ దర్శకుడు అదే కథను వేరే బ్యానర్ లో చేసేందుకు ప్రయత్నాల్లో ఉన్నట్టు వినికిడి. నాగ శౌర్య ఆ సబ్జెట్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో వదులుకున్నాడని టాక్. గతంలో వచ్చిన జగపతిబాబు ఆయనకు ఇద్దరు చాయల్లో ఈ మూవీ ఉండొచ్చని షూటింగ్ టైంలోనే ఒక రూమర్ వచ్చింది. అందుకే నాగ శౌర్య ఆ సినిమాను వదులుకున్నాడని మరో టాక్.

అసలు ప్రొడ్యూసర్ కి హీరో కి మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు వచ్చాయా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. శౌర్య కి ఇది కాకపోతే ఇంకో పెద్ద బ్యానర్ లో ఛాన్స్ వస్తుంది కానీ కొత్త డైరెక్టర్ కాబట్టి మరో ఛాన్స్ కోసం కొంచం ఇబ్బంది పడాల్సివస్తుంది.

Tags:    

Similar News