బ్రేకిస్తాడనుకుంటే… షాకిచ్చాడు..!

ఛలో సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన నాగశౌర్య నర్తనశాలతో డిజాస్టర్ కొట్టాడు. తరువాత రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ సగానికిపైగా [more]

Update: 2019-04-08 06:16 GMT

ఛలో సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన నాగశౌర్య నర్తనశాలతో డిజాస్టర్ కొట్టాడు. తరువాత రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయ్యింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజా కొలుసు దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో నాగ శౌర్య – ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే సగానికి పైగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందనే న్యూస్ మొదలయింది. మొన్నటికి మొన్న సుకుమార్ నిర్మాణంలో నాగ శౌర్య సినిమాని ఆపేశారని న్యూస్ ఇంకా ప్రచారంలో ఉండగానే ఇప్పుడు నాగ శౌర్య నటిస్తున్న మరో సినిమా ఆగిపోయిందనే న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది.

షూటింగ్ నచ్చకపోవడంతో…

నాగ శౌర్య – ఈషా రెబ్బా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పై నిర్మాత ఆనంద ప్రసాద్, హీరో నాగ శౌర్య అసంతృప్తిగా ఉండడంతో ఆ సినిమా ఆపేశారనే న్యూస్ వినబడుతుంది. మరి గత ఏడాది డిసెంబర్ లో భవ్య క్రియేషన్స్ అధిపతి, నిర్మాత ఆనంద ప్రసాద్ శేరిలింగంపల్లి నుండి ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడు ఎలక్షన్స్ కారణంగా షూటింగ్ కి కొన్నాళ్లు బ్రేకిస్తే.. ఇప్పుడు మాత్రం జరిగిన షూటింగ్ నచ్చక నాగ శౌర్య సినిమా ఆపేశారట. మరి నాగ శౌర్యతో నటిస్తున్నందుకు ఈషా రెబ్బ ఏంతో ఆనంద పడింది. నాగ శౌర్య అయినా బ్రేకిస్తాడనుకున్న ఈషా రెబ్బకి ఇప్పుడు నాగ శౌర్య షాకిచ్చాడు.

Tags:    

Similar News