మళ్లీ కాంబో రిపీట్ అవుతుంది..!

హిట్ చిత్రాల హీరోహీరోయిన్లు, దర్శకుల నుంచి తర్వాత వచ్చే చిత్రాలపై ప్రేక్షకుల్లో, సినీ వ్యాపారవర్గాలలో ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఇలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో [more]

Update: 2019-03-02 11:37 GMT

హిట్ చిత్రాల హీరోహీరోయిన్లు, దర్శకుల నుంచి తర్వాత వచ్చే చిత్రాలపై ప్రేక్షకుల్లో, సినీ వ్యాపారవర్గాలలో ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఇలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మించబోతోంది. ఆమధ్య నాగసౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే ‘నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్లో.. అంటే నాగసౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నారు.

Tags:    

Similar News