ప్లాప్స్ ఉన్నప్పటికీ మార్కెట్ పెరిగింది

నాగ శౌర్య సొంత బ్యానేర్ లో చేస్తున్న అశ్వథ్థామ సినిమా వచ్చే శుక్రవారం విడుదల కాబోతుంది. ప్రస్తుతం అశ్వథ్థామ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నాగ శౌర్య గత [more]

Update: 2020-01-26 07:59 GMT

నాగ శౌర్య సొంత బ్యానేర్ లో చేస్తున్న అశ్వథ్థామ సినిమా వచ్చే శుక్రవారం విడుదల కాబోతుంది. ప్రస్తుతం అశ్వథ్థామ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నాగ శౌర్య గత సినిమాల కన్నా ఎక్కువగా అశ్వథ్థామ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అశ్వథ్థామ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడం, నాగ శౌర్య లుక్స్ అన్ని ఆసక్తికరంగా ఉండడంతో.. ఈసినిమాపై ట్రేడ్ లోను అంచనాలు ఏర్పడ్డాయి. అందులోను అశ్వథ్థామ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో పెద్ద హీరోలతో సమానమైన వ్యూస్ రాబట్టడం, ఈ సినిమాకి శౌర్య చేస్తున్న ప్రమోషన్స్ అన్ని సినిమా మార్కెట్ ని పెంచేసాయి.

కాబట్టే అశ్వథ్థామ సినిమాకి 15 కోట్లమేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. గతంలో ఓన్ బ్యానర్ ఐర క్రియేషన్స్ లో చేసిన ఛలో సినిమాని 6 కోట్లకి విక్రయిస్తే..ఆ సినిమాకి డబుల్ లాభాలొచ్చాయి. తర్వాత నాగ శౌర్య సినిమాలేవీ సక్సెస్ కాకపోయినా.. సమంత సోలో గా చేసిన ఓ బేబీ సినిమాలో నాగ శౌర్య డీసెంట్ గా కనిపించడం, అశ్వథ్థామ ట్రైలర్ అన్ని కలిపి అశ్వథ్థామ సినిమా బిజినెస్ భారీగా జరిగింది. మాస్ గా కనబడుతూనే అశ్వథ్థామ కథపై శౌర్య నమ్మకం పెట్టుకోవడం, ఫస్ట్ లుక్ దగ్గరనుండి తన సినిమాపై ప్రేక్షకులలో శక్తిపెరిగేలా చెయ్యడంతో.. ఇంత భారీ బిజినెస్ అశ్వథ్థామ కి జరిగింది అంటున్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లయితే.. సినిమా కి హిట్ టాక్ పడితే శాటిలైట్, ఇతర డిజిటల్ హక్కులు అన్ని కలిపి మరో పది కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదని అంటున్నారు.

Tags:    

Similar News