శౌర్య అశ్వద్ధామ శాటిలైట్ ఎంతకీ వెళ్లిందో తెలుసా?

నటుడు నాగ శౌర్య కి ఛలో తరువాత ఒక్క హిట్ కూడా రాలేదు. ఛలో తరువాత అతను రెండుమూడు సినిమాలు చేసాడు కానీ అవేమీ ఆశించిన ఫలితాలు [more]

Update: 2019-07-31 08:54 GMT

నటుడు నాగ శౌర్య కి ఛలో తరువాత ఒక్క హిట్ కూడా రాలేదు. ఛలో తరువాత అతను రెండుమూడు సినిమాలు చేసాడు కానీ అవేమీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రీసెంట్ గా ఓ బేబీ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాగ శౌర్య లేటెస్ట్ గా అతను హీరోగా చేస్తున్న అశ్వద్ధామ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. కారణం ఈసినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి క్లోజ్ అవ్వడమే.

మూడు కోట్లు దాటిన…..

ఈమూవీ ని అక్షరాలా 3 కోట్ల 15 లక్షల తో ఓ ప్రముఖ ఛానల్ కొన్నట్టు సమాచారం. ఇది ఏ యాంగిల్ లో చూసినా భారీ మొత్తమే. నాగ శౌర్య సినిమాకి ఇంతలా రేట్ రావడం అంటే మాములు విషయం కాదు. ఇక ఫస్ట్ లుక్, టీజర్, వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేయకుండా శాటిలైట్ కి అంత ఆఫర్ రావడం అంటే బంపర్ ఆఫర్ కిందే చెప్పొచ్చు.

సొంత బ్యానర్ పై….

ఇక ఈమూవీ నాగ శౌర్య తన సొంత బ్యానర్ నిర్మిస్తున్నాడు. ఐరా క్రియేషన్స్ లో ఈమూవీ తెరకెక్కుతుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈమూవీ తరువాత శౌర్య రాఘవేంద్రరావుతో ముగ్గురు దర్శకులతో ఒకే సినిమాలో పొందుపరిచే మూడు ప్రేమకథలు సినిమాలో జాయిన్ అవుతాడు.

Tags:    

Similar News