చిచోరే పై మనసు పారేసుకున్న టాలీవుడ్ హీరో?

బాలీవుడ్ లో చిన్న చిత్రంగా తెరకెక్కి.. అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిచోరే సినిమాపై ఇప్పుడొక టాలీవుడ్ హీరో మనసుపారేసుకున్నాడనే టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది. [more]

Update: 2019-11-18 05:05 GMT

బాలీవుడ్ లో చిన్న చిత్రంగా తెరకెక్కి.. అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిచోరే సినిమాపై ఇప్పుడొక టాలీవుడ్ హీరో మనసుపారేసుకున్నాడనే టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది. కాలేజ్ క్యాంపస్‌ బ్యాగ్డ్రాప్ లో చేసిన కామెడీకి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో.. ఎటువంటి అంచనాలు లేకుండానే ఈ సినిమా నూట యాభై కోట్లకి పైగా కొల్లగొట్టి సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాపై ఇప్పుడు నాగ చైతన్య ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. మజిలీ తో హిట్ కొట్టిన నాగ చైతన్య వెంకిమామ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇక వెంకిమామ తో పాటుగా నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ (వాడుకలో ఉన్న టైటిల్) సినిమాలో సాయి పల్లవితో జోడి కట్టాడు. ఈ సినిమా మార్చి లో విడుదలకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాల తర్వాత చైతన్య చిచోరే సినిమా రీమేక్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట. మరి ఇంతకుముందు కూడా చైతు చాలా సినిమాలు రీమేక్ చెయ్యాలని అనుకుని.. తర్వాత స్ట్రయిట్ కథల్తోనే సినిమాలు చేసాడు కానీ…. ఎప్పుడూ రీమేక్ జోలికి వెళ్ళాడు. కానీ.. తాజాగా చిచోరే ని మాత్రం వదలను అని చైతు అంటున్నట్టుగా టాక్. మరి చిచోరే లో హీరోహీరోయిన్స్ మిగతా నటులతో కలిసి నవ్వులు పండిస్తారు. అల చైతు కి ఎలాంటి బ్యాచ్ ఈ సినిమా కోసం సెట్ అవుతారో చూడాలి

Tags:    

Similar News