చైతు అండ్ సురేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

రామానాయడు ఈ పేరు వింటే మనకి బ్లాక్ బస్టర్స్ చిత్రాలు, సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. అలానే ఇతని పేరు మీద నిర్మితమైన రామానాయుడు స్టూడియోస్ కూడా [more]

Update: 2019-06-06 07:04 GMT

రామానాయడు ఈ పేరు వింటే మనకి బ్లాక్ బస్టర్స్ చిత్రాలు, సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. అలానే ఇతని పేరు మీద నిర్మితమైన రామానాయుడు స్టూడియోస్ కూడా గుర్తుకు వస్తుంది. అయితే ఈరోజు రామానాయడు జయంతి సంధర్బంగా తన తాత కు “వెంకీ మామ” మూవీని అంకితమిస్తున్నట్లుగా చైతు, నిర్మాత సురేష్ బాబు ఓ బావోద్వేగ ట్వీట్ చేశారు.

వెంకీమామ మూవీ కి సంబంధించి ఓ పోస్టర్ పోస్ట్ చేసి “ఇదంతా మీకోసమే తాతయ్య” అని సందేశం రాసాడు చైతు. ఆ పోస్టర్ పైనే “మనువడు, కొడుకు ఒకే మూవీలో సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్నది మీ కల, అది నిజమైయ్యే నాటికి మీరు మాకు దూరంగా వెళ్లిపోయారు” అంటూ సురేష్ బాబు సందేశం ఆ పోస్టర్ పై ఉంది.

ఇలా ఇద్దరు తమ అభిప్రాయాల్ని ఎమోషనల్ గా చెప్పారు. రామానాయుడు 1936 జూన్ 6న జన్మించి…ఫిబ్రవరి 18, 2015 లో కన్నుమూశారు. ఇక వెంకీమామ చిత్రం యొక్క టీజర్ త్వరలోనే రిలీజ్ కానుంది.

Tags:    

Similar News