భార్య - తండ్రి మధ్యలో నలిగిపోతున్న చైతు?

Update: 2018-08-29 09:40 GMT

నాగ చైతన్య కి బ్యాడ్ టైం నడుస్తుంది. గత ఏడాది యుద్ధంశరణంతో బాగా దెబ్బతిన్న నాగ చైతన్య ఈ ఏడాది ఎంతో కాన్ఫిడెంట్ గా సవ్యసాచి, శైలజ రెడ్డి సినిమాలు చేసాడు. చందు మొండేది దర్శకత్వంలో సవ్యసాచి సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసిన.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో.. ఈ సినిమా విడుదల లేట్ అయ్యింది. ఇక నాగ చైతన్య ఎంతో నమ్మకంతో మారుతీ దర్శకత్వంలో చేసిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా అనుకున్న టైం కి థియేటర్స్ లోకి రాలేదు. షూటింగ్ ని జెట్ స్పీడు తో పూర్తి చేసిన... కేరళ వరదల కారణంగా ఆర్ ఆర్ లేటవడంతో సినిమా విడుదల వాయిదా పడింది.

ఇక శైలజ రెడ్డి అల్లుడుకి మరో డేట్ ఇవ్వడానికి చైతు తో సహా మారుతీ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మధ్యలో సెప్టెంబర్ 13 న శైలజ రెడ్డి అల్లుడు సినిమా విడుదల అంటూ ప్రచారం జరిగింది. కానీ సినిమా అప్పుడు అయితే రావడం లేదు. ఆగష్టు 31 నుండి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాని సెప్టెంబర్ 7 న విడుదల చేద్దామంటే.. నాలుగైదు చిన్న సినిమాలున్నాయి.. ఎందుకులే అనుకుంటే... సెప్టెంబర్ 13 వినాయక చవితి కి వద్దామనుకుంటే... సమంత యు - టర్న్ తో రెడీగా కూర్చుంది. ఎప్పుడో యు- టర్న్ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 13 అని ఫిక్స్ అయ్యింది. అలాగే సెప్టెంబర్ తర్వాత అంటే సెప్టెంబర్ నెలాఖరులో డేట్ ఇద్దామనుకుంటే... నాగార్జున దేవదాస్ తో రెడీగా ఉన్నాడు. మరి భార్యకి తండ్రికి మధ్యలో చైతు ఎటూ కాకుండా నలిగిపోతున్నాడు.

నాగ చైతన్య కోసం సమంత యు- టర్న్ వాయిదా వేసుకుంటుంది అనుకున్నారు అంతా... అలానే ప్రచారం కూడా జరిగింది. కానీ సమంత మాత్రం అందుకు సిద్ధం గా లేదు. యు టర్న్ ఖచ్చితంగా వినాయక చవితి అంటే సెప్టెంబర్ 13 కే వస్తుందని సోషల్ మీడియా సాక్షిగా తెలియజేసింది. ఇక ఆ డేట్ కాకపోతే నెలాఖరున అనుకున్నా... నాగార్జున - నాని మల్టీస్టారర్ మూవీ దేవదాస్ ఉంది. కనక తండ్రికి పోటీ రాలేడు. అందుకే శైలజ రెడ్డి అల్లుడు విడుదల తేదీ విషయంలో చైతు ఫుల్ కన్ఫ్యూషన్ లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. నాగ చైతన్య కి మారుతికి శైలజ రెడ్డి అల్లుడు విడుదల తేదీ టెంక్షన్ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అల్లుడు గారు ఎప్పుడు వేంచేస్తారో అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు.

Similar News