చైతు లిప్ లాక్ పెట్టింది సమంతకి కాదు..!

నాగ చైతన్య – సమంత – దివ్యంశ కౌశిక్ హీరోహీరోయిన్స్ గా నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మజిలీ సినిమా టీజర్ ప్రేమికుల రోజు [more]

Update: 2019-02-14 07:33 GMT

నాగ చైతన్య – సమంత – దివ్యంశ కౌశిక్ హీరోహీరోయిన్స్ గా నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మజిలీ సినిమా టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు విడుదలైంది. మజిలీ సినిమాలో నాగ చైతన్య క్రికెటర్ గా కనబడుతుండగా… సమంత చాలా డీగ్లామర్ గా చైతు భార్యగా కనబడుతుంది. ఇక నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ గా చైతుని మోసం చేసే ప్రియురాలి పాత్రలో దివ్యంశ కౌశిక్ కనబడుతుందనేది మజిలీ టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ప్రేక్షకుల హృదయాలను దోచేసేలా మజిలీ టీజర్ ని కట్ చేశారు.

ప్రేమ విఫలమైన వ్యక్తిలా..

టీజర్ మొదటగా రావు రమేష్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. నీకో సంవత్సరం టైం ఇస్తున్న… ఈ లోగా నువ్వు సచిన్ వి అవుతావో… సోంబేరి అవుతావో అంటూ… రావు రమేష్.. నాగ చైతన్య ని ఉద్దేశించి చెప్పడం.. అలాగే వాల్తేరు గ్రౌండ్ లో చైతు క్రికెట్ ప్రాక్టీసు చెయ్యడం చూపిస్తూనే నాగ చైతన్య, దివ్యంశ కౌశిక్ ప్రేమలో పాడడం.. ఆమెతో లిప్ లాక్ చెయ్యడం దగ్గర నుండి .. ఆమెని డీప్ గా లవ్ చెయ్యడం.. మధ్యలో ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందో.. కెరీర్ కోసం దివ్యంశని వదిలేసాడో.. సమంతని పెళ్లి చేసుకోవడంతో.. చైతు డిఫరెంట్ లుక్ లోకి మారిపోతాడు. ప్రేమని దూరం చేసుకున్న ప్రేమికుడిలా చైతు గెడ్డం లుక్ తో… నువ్వు నా రూం లోపలికి రాగలవేమో గానీ, నా మనసులోకి ఎప్పటికీ రాలేవు అంటూ సమంతతో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

టీజర్ తోనే మంచి అంచనాలు

ఇక సమంత కూడా భర్త తప్పులను, ద్వేషాన్ని భరిస్తూ.. చాలా సాదాసీదా గృహిణిగా భర్తను వెనకేసుకొచ్చే అమ్మాయిలా కనబడుతుంది. మరి లవ్, ఎమోషన్స్ కలగలిసిన మజిలీ.. టీజర్ తోనే మంచి అంచనాలు పెంచేసింది. అసలే చైతు – సమంత కాంబినేషన్, అలాగే హిట్ డైరెక్టర్ శివ నిర్వాణ, చైతు మాస్ లుక్, సమంత డిగ్లామర్ లుక్, దివ్యంశ చైతు ప్రియురాలిలా అందరూ ఆకట్టుకున్నారు. మరి భారీ అంచనాలతో దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News