ఆ సీన్స్ సినిమాకి హైలెట్ అంట..!

నాగ చైతన్య – సమంత పెళ్లి తర్వాత మొదటిసారిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటించారు. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మజిలీ సినిమా [more]

Update: 2019-02-28 08:48 GMT

నాగ చైతన్య – సమంత పెళ్లి తర్వాత మొదటిసారిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటించారు. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మజిలీ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. చైతు – సామ్ లు మజిలీ సినిమాలోనూ భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమాలో నాగ చైతన్య క్రికెటర్ గా, ప్రేమలో ఓడిపోయిన ప్రేమికుడిగా.. అలాగే ప్రేమించిన అమ్మాయి మీద ప్రేమను చంపుకోలేక… భార్యతో అడ్జెస్ట్ కాలేక రఫ్ గా ఉండే క్యారెక్టర్ చేసాడు. ఇక సమంత.. చైతుని పెళ్లి చేసుకుని సాధారణ గృహిణిలా.. భర్తను వెనకేసుకొచ్చే భార్య పాత్రలో నటించింది.

చైతు నటన ఆకట్టుకుంటుందట…

అయితే మజిలీ సినిమాలో ఈ భార్యాభర్తల మధ్య వచ్చే సన్నివేశాలే కీలకం అని చెబుతుంది మజిలీ చిత్ర బృందం. ఈ సినిమాలో చైతు క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందట. అలాగే చైతు కెరీర్ లోనే ఇలాంటి క్యారెక్టర్ ఇదివరకు ఎప్పుడు చెయ్యలేదని.. ఇంకా ఈ సినిమాలో సమంతతో పెళ్లి అయ్యాక చైతుకి సంబంధించిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. మరి శివ నిర్వాణ మొదటి చిత్రం నిన్నుకోరి సినిమా కథకు రివర్స్ లో మజిలీ కథ ఉన్నట్లు తెలుస్తోంది. మజిలీ టీజర్, పోస్టర్స్ చూస్తుంటే మాత్రం సినిమాలో మంచి విషయం ఉందనిపిస్తుంది. ఈసారి చైతుకి హిట్ గ్యారెంటీ అనిపిస్తుంది.

Tags:    

Similar News