సామ్ ఆశలపై నీళ్లు చల్లిన చైతు..!

పెళ్లి తరువాత నాగచైతన్య, సమంత కలిసి చేసిన సినిమా మజిలీ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్ సైతం ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమా [more]

Update: 2019-04-15 10:10 GMT

పెళ్లి తరువాత నాగచైతన్య, సమంత కలిసి చేసిన సినిమా మజిలీ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్ సైతం ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత సమంత మూడు వారాల పాటు గ్యాప్ తీసుకుని నెక్స్ట్ మూవీ షూట్ పై దృష్టి పెట్టనుంది. అలానే తన భర్త చైతు కూడా ఒక వీక్ గ్యాప్ తీసుకుంటే చక్కగా ఇద్దరూ కలిసి హాలిడేకు వెళదామని అనుకుంది సామ్. కానీ పాపం సామ్ కు తన భర్త చైతు అంత ఛాన్స్ ఇవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయాడు. మజిలీ సినిమా తరువాత చైతు వెంకీ మామ సెట్స్ కి వెళ్లిపోయాడు.

వెంకీ మామతో బిజీగా చైతు

ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరగనుంది. వెంకీ మామ కంప్లీట్ అవ్వగానే దిల్ రాజు బ్యానర్ లో శశి అనే దర్శకుడితో మరో సినిమా చేయనున్నాడు చైతు. ఇలా గ్యాప్ లేకుండా చైతు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. పెళ్లి తరువాత వరుస సినిమాలతో బిజీ అయిన చైతు ఇంతవరకు హనీమూన్ కూడా ప్లాన్ చేసుకోలేదట. ఇలా ఇద్దరూ తమ సినిమాలతో బిజీ అయిపోవడంతో కుదరడం లేదు.

Tags:    

Similar News