రకుల్ ప్రీత్ కు షాకిచ్చిన నాగచైతన్య

ప్రస్తుతం హీరోయిన్ రకుల్ ప్రీత్ పరిస్థితి తెలుగు, తమిళంలో ఒకే విధంగా ఉంది. అస్సలు హిట్స్ లేని రకుల్ ప్రీత్ క్రేజ్ తెలుగులో తగ్గుమొహం పట్టింది. కానీ [more]

Update: 2019-02-21 07:32 GMT

ప్రస్తుతం హీరోయిన్ రకుల్ ప్రీత్ పరిస్థితి తెలుగు, తమిళంలో ఒకే విధంగా ఉంది. అస్సలు హిట్స్ లేని రకుల్ ప్రీత్ క్రేజ్ తెలుగులో తగ్గుమొహం పట్టింది. కానీ తమిళంలో మాత్రం పర్వాలేదనిపిస్తుంటే.. నిన్నగాక మొన్న విడుదలైన దేవ్ సినిమాతో ఉన్న క్రేజ్ కాస్త గోవిందా అయ్యింది. తాజాగా రకుల్ ప్రీత్ కి యంగ్ హీరోలు వరుసబెట్టి షాకులివ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మరింది. ఆ హీరోల్లో మొదటి వ్యక్తి బెల్లంకొండ శ్రీనివాస్. తనకి పెద్దగా క్రేజ్ లేకపోవడంతో.. టాప్ హీరోయిన్స్ ని తన సినిమాల్లో బుక్ చేసి తన సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ కలిగిస్తుంటాడు. అందుకే టాప్ హీరోయిన్స్ ని కోట్లు కుమ్మరించి మరీ తన సినిమాల్లోకి ఎంపిక చేసుకుంటాడు.

రకుల్ ప్లేస్ లో రాశీ ఖన్నా…

అలాగే రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ ఉన్నప్పుడు కోటిన్నర పైనే రకుల్ కి ముట్టజెప్పి మరీ ఆమెని తన జయ జానకి నాయక సినిమాకి తీసుకున్నాడు. తాజాగా మరోసారి బెల్లంకొండ రకుల్ తో జోడి కట్టబోతున్నాడనే న్యూస్ బాగానే హైలెట్ అయ్యింది. బెల్లంకొండ రైటర్ అండ్ డైరెక్టర్ రమేష్ వర్మతో చెయ్యబోయే తమిళ రాట్చసన్ రీమేక్ లో రకుల్ ప్రీత్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుండగా… ప్రస్తుతం క్రేజ్ కోల్పోయిన రకుల్ మళ్లీ బెల్లంకొండ సినిమాకి కోటిన్నర డిమాండ్ చెయ్యగా… అసలే క్రేజ్ లో లేని హీరోయిన్ మనకెందుకులే అని.. రకుల్ ప్లేస్ లోకి రాశీ ఖన్నాని ఎంపిక చేసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మరి రకుల్ ని కేవలం పారితోషకం ఎక్కువని తప్పించారో.. లేదంటే క్రేజ్ లేదనుకున్నారో కానీ రకుల్ కి ఇది పెద్ద షాకే.

నాగచైతన్య కూడా…

తాజాగా మరో యంగ్ హీరో నాగచైతన్య కూడా రకుల్ కి షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేని రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో రారండోయ్ వేడుక చూద్దాంతో హిట్ ఇచ్చిన నాగ చైతన్యతో వెంకీ మామ అనే మల్టి స్టారర్ లో హీరోయిన్ గా ఎంపికైంది. మరి రకుల్ ప్రీత్ చేతిలో ఉన్న ఏకైక చిత్రం వెంకిమామ కాగా.. తాజాగా ఆ అవకాశం కూడా రకుల్ చేజారిందని… రకుల్ ప్లేస్ లోకి నన్ను దోచుకుందువటే ఫేమ్.. నభా నటేష్ ని తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా టాక్. నభా నటేష్ ని చైతుకి హీరోయిన్ గా దర్శకుడు బాబీ, నిర్మాత సురేష్ ఫైనల్ చేసారని.. రకుల్ కి క్రేజ్ లేకపోవడంతోనే ఆమెని తప్పించినట్లుగా చెబుతున్నారు. మరి ఇలా వరుసగా రకుల్ కి యంగ్ హీరోస్ షాకుల మీద షాకులిస్తుంటే.. ఇక తెలుగులో రకుల్ కనబడదేమో అనే డౌట్ మాత్రం వచ్చేస్తుంది.

Tags:    

Similar News