చైతూ సినిమా ఎప్పుడొస్తుందో..?

Update: 2018-07-03 07:46 GMT

పెళ్లి తర్వాత నాగ చైతన్య సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడు కానీ... చైతు నటించిన సినిమాలేవీ విడుదల కావడం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య - నిధి అగర్వాల్ జంటగా... తమిళ హీరో మాధవన్ విలన్ గా తెరకెక్కిన సవ్యసాచి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా వచ్చే ఆగష్టు లో విడుదలవుతుంది అనుకుంటే ప్రస్తుతం సవ్యసాచి స్టేటస్ ఎక్కడా బయటకి రావడం లేదు. అంటే ఈ సినిమా ఎప్పుడు విడుదల చెయ్యాలి అనే క్లారిటీ చిత్ర బృందానికి లేనట్టే.

ప్రమోషన్స్ లేకపోతే ఎలా...

ఇక నాగ చైతన్య - మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న శైలజ రెడ్డి అల్లుడు మాత్రం ఫుల్ స్పీడు గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆగష్టు నెలాఖరుకి విడుదల ఏర్పాట్లు మొదలెట్టేసింది. అను ఇమ్మాన్యువల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నాగ చైతన్య అత్తగా పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తుంది. ప్రస్తుతం ట్రాక్ లో ఉన్న మారుతీ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టేస్తాడంటున్నారు. అయితే శైలజ రెడ్డి సినిమాని ఆగష్టు నెలాఖరున విడుదల చెయ్యాలి అంటే గనక ఇప్పటినుండే ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలి. కానీ శైలజ రెడ్డి ఫస్ట్ లుక్ జూన్ 30 న విడుదల చేస్తామని చెప్పారు కానీ చెయ్యలేదు.

మామతో కలిసి కొత్త సినిమా...

మరి ప్రమోషన్స్ లో జోరు చూపిస్తేనే సినిమా మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ పెరిగేది. మరి నాగ చైతన్య కి అటు సవ్యసాచి టెన్షన్ తో ఇటు శైలజ రెడ్డి అల్లుడు సినిమా ప్రమోషన్స్ కి మధ్య నలిగిపోతున్నాడా.. అది కరెక్ట్ గా క్లారిటీ లేదుగానీ, చైతు మాత్రం రెండు సినిమాలతో ప్రేక్షకుల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నాడు. అదలా ఉండగా... చైతు తాజాగా తన మామయ్య వెంకటేష్ తో కలిసి ఒక మల్టీస్టారర్ ని పెద్ద మామ బ్యానర్ లో అంటే సురేష్ ప్రొడక్షన్ లోనే చెయ్యబోతున్నాడు. అలాగే తన భార్య తో కలిసి పెళ్లయ్యాక మొదటిసారి శివ నిర్వాణ దర్శకత్వంలో మరో మూవీ చెయ్యబోతున్నాడు.

Similar News