కొత్త రోల్ లో నాగచైతన్య..!

వెంకటేష్ – నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామను బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 22 నుండి రాజమండ్రిలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ [more]

Update: 2019-02-18 10:54 GMT

వెంకటేష్ – నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామను బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 22 నుండి రాజమండ్రిలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఇందులో మామ – అల్లుళ్లుగా వెంకీ – చైతు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో చైతు ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నాడని తాజా సమాచారం.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా…

ఆర్మీ ఆఫీసర్ అంటే సీరియస్ గానే ఉంటాడట. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని రైటర్ కోన వెంకట్ తన మార్క్ కామెడీని అందిస్తున్నాడని టాక్. వెంకీ సరసన శ్రీయ, చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ తో పాటు కోన ఫిలిం కార్పొరేషన్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News