పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత కూడా..!

Update: 2018-09-15 10:15 GMT

నాగ చైతన్యకి అస్సలు కలిసిరావడం లేదు. ప్లేబాయ్ గా హిట్స్ అందుకున్న నాగ చైతన్య మాస్ మూసలో మాత్రం పైకి రాలేకపోతున్నాడనేది వాస్తవం. ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన సమంత - నాగ చైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు తర్వాత కూడా సమంత జోరు మాత్రం తగ్గలేదు. కానీ నాగ చైతన్యకే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా అస్సలు కలిసి రావడం లేదు. పెళ్లి పీటలెక్కే ముందు యుద్ధం శరణం అంటూ ఫ్లాప్ అందుకున్న చైతూ పెళ్లి తర్వాత ఏడాదికి శైలజారెడ్డి అల్లుడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ శైలజారెడ్డి అల్లుడు సినిమాకి ప్రేక్షకులు యావరేజ్ టాక్ ఇచ్చారు. కానీ కలెక్షన్స్ పరంగా శైలజారెడ్డి అల్లుడు ఫర్వాలేదనిపించారు. ఇక సినిమాలో మారుతీ మార్క్ కామెడీ గాని.. కథనంలో బలం గాని లేకపోవడం.. సినిమాకి మ్యూజిక్ సరిగ్గా వర్కౌట్ అవకపోవడంతో సినిమాకి యావరేజ్ టాక్ పడింది.

సవ్యసాచి అయినా కలిసొస్తుందా..?

కాకపోయే చైతూ నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమాకి యావరేజ్ మార్కులు పడడంతో చైతూకి ఈ సినిమా కూడా హిట్ ఇవ్వలేకపోయింది. పెళ్లికి ముందు యుద్ధం శరణం, పెళ్లి తర్వాత శైలజారెడ్డి అల్లుడు, ఇక మిగిలింది సవ్యసాచి. చందు మొండేటి దర్శకత్వంలో ఆగస్టులోనే విడుదల కావాల్సిన సవ్యసాచి అనుకోని కారణాలతో వెనక్కి వెళ్లిపోయింది. అయితే సవ్యసాచిలో కూడా మాస్ లుక్ తోనే ఉన్నాడు నాగ చైతన్య. మరి చందు మొండేటి ప్రేమమ్ తో కలిసి హిట్ ఇచ్చాడు.. సవ్యసాచితో ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Similar News