నాగ్ చాలా పెద్ద తప్పు చేశాడు!

Update: 2018-06-07 09:37 GMT

ఎంతమంది చెప్పినా, ఎందరు వాదించినా నాగార్జున.. రామ్ గోపాల్ వర్మతో 'ఆఫీసర్' చేశాడు. స్టోరీ బాగుంది అందుకే చేస్తున్న అని అన్నాడు. చివరికి ఏం అయింది ఆ సినిమా ఆయనను పూర్తిగా డ్యామేజ్ చేసింది. ఎన్నో చెత్త సినిమాలు తీసిన అనుభవం ఉన్న రాముతో సినిమా చేయడం వల్ల తన కెరీర్ లో ఎన్నడూలేని విధంగా దారుణమైన కలెక్షన్స్ చూడాల్సి వచ్చింది. తెలుగు సినీ చరిత్రలోనే ఏ పెద్ద హీరోకు రాని దారుణాతి దారుణమైన వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. అసలే ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకు ‘ఆఫీసర్’ ఫలితం మామూలు దెబ్బ కాదు. ఇంత జరిగిన నాగ్ ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఉన్నాడు. 'ఆఫీసర్' సినిమాను రాముతో చేసినందుకు తనకు తానే తిట్టుకుంటున్నాడు.

తక్కువ పారితోషకంతోనే...

'శివ' సినిమాతో తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన కృతజ్ఞతతో నాగ్.. వర్మకు సినిమా చేశాడేమో తెలియదు కానీ.. ఎప్పుడు తీసుకునే పారితోషకం కంటే ఈ సినిమాకు తక్కువే తీసుకున్నాడట. రూ.3 కోట్లే తీసుకున్నాడని సమాచారం. పారితోషకం పోతే పోయింది కానీ సినిమా డిజాస్టర్ అయిన మచ్చ ఎప్పటికీ పోదు. మరి దీనిని పరిగణలోకి తీసుకుని తను నెక్స్ట్ చేసే మూవీస్ లో ఎంత జాగ్రత్తగా ఉంటాడో చూడాలి.

Similar News