అందుకే నాగ్ టెంప్ట్ అయ్యాడు!!

నాగార్జున సినిమా షూటింగ్స్ కి కరోనా అడ్డం వచ్చింది కానీ.. కరోనా టైం లోనే బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్ట్ చెయ్యడానికి కరోనా అడ్డం రాలేదు. [more]

Update: 2020-08-14 06:09 GMT

నాగార్జున సినిమా షూటింగ్స్ కి కరోనా అడ్డం వచ్చింది కానీ.. కరోనా టైం లోనే బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్ట్ చెయ్యడానికి కరోనా అడ్డం రాలేదు. ఇప్పుడు ఈ విషయమై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. కరోనా కరోనా అంటూ సినిమా షూటింగ్స్ కి ఎగ్గొట్టిన స్టార్ హీరోలు అందరూ గప్ చుప్ గా ఇంట్లో ఉంటె నాగార్జున మాత్రం సినిమా షూటింగ్స్ పక్కన పెట్టి బిగ్ బాస్ ప్రోమో షూట్ కి, అలాగే ప్రతి శని, ఆది వరాల ఎపిసోడ్స్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అసలైతే ఈ నెలాఖరు నుండే బిగ్ బాస్ మొదలవ్వాలి కానీ.. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ సెప్టెంబర్ కి వాయిదా పడింది.

ఇక సీజన్ వన్ కోసం ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటే.. సీజన్ 2 కోసం నాని కి మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక సీజన్ త్రీ కి కూడా నాగార్జున బాగానే దండుకున్నాడు. 104 రోజులు 15 ఎపిసోడ్స్ కోసం నాగార్జున సీజన్ త్రీ కి 5 కోట్ల పారితోషకం అందుకుంటే.. ఇప్పుడు సీజన్ 4 కోసం నాగ్ అదే 15 ఎపిసోడ్స్, 106  డేస్ కోసం 8 కోట్లుగా అందుకోబోతున్నాడట. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 106 రోజులు 15 ఎపిసోడ్స్ తో ప్రారంభమైనా.. కరోనా సమయంలో షో ఎప్పుడైనా ఆగిపోవచ్చు . లేదంటే ఫుల్ ఎపిసోడ్స్ జరగవచ్చు. అందుకే నాగ్ తెలివిగా ఎపిసోడ్ కి ఇంత అని కాకుండా బిగ్ బాస్ ఎపిసోడ్స్ మొత్తానికి అంటే సీజన్ 4 మొత్తానికి కలిపి 8 కోట్లు అందుకోబోతున్నాడట.

గత సీజన్ లో 5 కోట్లు అందుకున్న నాగ్ ఇప్పుడు 4 వ సీజన్ కోసం 8 కోట్లు అంటే 3 కోట్లు ఎక్కువ అందుకోబోతున్నాడన్నమాట. అయితే సోషల్ మీడియాలో మాత్రం నాగార్జున కి భారీ పారితోషకం ఇస్తున్నారు గనకనే బిగ్ బాస్ ఒప్పుకున్నాడు. లేదంటే కరోనా టైం లో నాగ్ అంత సాహసం చేస్తాడా అంటున్నారు. మరి నిజమేనేమో నాగ్ పారితోషకాన్ని టెంప్ట్ అయ్యే బిగ్ బాస్ చేస్తున్నాడేమో. 

Tags:    

Similar News