నాగ్ ని అలా చూడలేం!!

నాగార్జున ఇప్పటికి నవ మన్మధుడే. కొడుకు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ సినిమా రంగంలోకి వచ్చినా నాగ్ అందం ముందు దిగడుపే అనేట్టుగా నాగార్జున మెయింటినెన్స్ ఉంటుంది. [more]

Update: 2020-08-14 05:44 GMT

నాగార్జున ఇప్పటికి నవ మన్మధుడే. కొడుకు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ సినిమా రంగంలోకి వచ్చినా నాగ్ అందం ముందు దిగడుపే అనేట్టుగా నాగార్జున మెయింటినెన్స్ ఉంటుంది. ఇప్పటికి యంగ్ లుక్స్ లోనే నాగార్జున కనిపిస్తాడు. చక్కటి ఫిట్నెస్, మంచి శరీరం, అందానికి అందం అన్ని నాగ్ సొంతం. ఆలాంటి నాగార్జునని ముసలివాడిగా చూడడం అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 4 కోసం నాగార్జున ముసలి గెటప్ ఎత్తాడు. బిగ్ బాస్ సీజన్ 4 మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. దానికోసం ఓ ప్రోమో షూట్ జరిగింది.

నాగార్జున కరోనా సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ లో పాల్గొంటున్నాడు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున అందరికి షాకిచ్చాడు. వయసు మళ్ళిన ముసలాడీలా… తెల్లని మీసాలు మరియు నెరిసిన జుట్టుతో.. నాగ్ ముసలివాడైపోయాడు. ఆ ముసలి గెటప్ లో నాగార్జున  ఒక స్కోప్ పట్టుకొని కంటెస్టెంట్స్ ను వీక్షిస్తున్నట్టుగా ఆ ప్రోమోలో కనిపిస్తున్నాడు. మరి ఎప్పుడూ అందంగా కనబడే నాగ్ ని అలాంటి ముసలి అవతారంలో చూసి అక్కినేని ఫాన్స్ షాకవుతున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 4 కోసం నాగార్జున శని, ఆదివారాలు బుల్లితెర మీద సందడి చెయ్యడానికి రాబోతున్నాడు. 

Tags:    

Similar News