హ్యాపీ బ‌ర్త్ డే టూ దేవా...

Update: 2018-08-28 13:01 GMT

అక్కినేని నాగార్జున, నాని న‌టిస్తున్న దేవ‌దాస్ టీజ‌ర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఫ‌స్ట్ లుక్ కు కూడా అదిరిపోయే ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాతలు నాగార్జున సోలో లుక్ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆగ‌స్టు 29 ఆయ‌న పుట్టిన‌రోజు కానుక‌గా ఈ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు. నాగార్జున ఈ చిత్రంలో దేవా పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. వైజ‌యంతి బ్యాన‌ర్ లో సి అశ్వినీద‌త్ దేవ‌దాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు:

నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌.

సాంకేతిక విభాగం:

ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌

నిర్మాత‌: అశ్వినీద‌త్

సంస్థ‌: వైజయంతి మూవీస్

సినిమాటోగ్ర‌ఫ‌ర్: శ్యామ్ ద‌త్ సైనూద్దీన్

సంగీతం: మ‌ణిశ‌ర్మ

ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహీ సురేష్

Similar News