నాగ్ కి అంతగా ఎందుకు మండిందో?

నాగార్జున ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా ఉంటాడు. సినిమాల విషయంలో అయినా.. బిజినెస్ వ్యవహారాలైన, బిగ్ బాస్ హిట్స్ విషయంలో అయినా.. దేనికైనా సరే. అయితే [more]

Update: 2020-07-28 08:56 GMT

నాగార్జున ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా ఉంటాడు. సినిమాల విషయంలో అయినా.. బిజినెస్ వ్యవహారాలైన, బిగ్ బాస్ హిట్స్ విషయంలో అయినా.. దేనికైనా సరే. అయితే నిన్నమొన్నటివరకు షూటింగ్స్ ల విషయంలో ప్రభుత్వ అనుమతుల కోసం చిరు అండ్ బ్యాచ్ తో తిరిగిన నాగార్జున ఇప్పుడు షూటింగ్స్ లెవ్ ఏం లెవ్ అంటున్నాడు. ఇక బిగ్ బాస్ కి హోస్ట్ గ చెయ్యాలన్నా నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యానికి సవాలక్ష కండిషన్స్ పెట్టాడనే టాక్ ఉంది. అయితే తాజాగా నాగార్జున డిజిటిల్ స్త్రీమింగ్స్ ఓటిటి సంస్థలపై ఫైర్ అయ్యాడనే టాక్ నడుస్తుంది. కారణం వేరే చెప్పక్కర్లేదు. అది నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్, అఖిల్ తాజా చిత్రం మోస్టల్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. చిత్రాలే.

ఈ రెండు చిత్రాల కోసం ఓటిటి వారు నాగార్జునని సంప్రదించారట. ఎలాగూ చాలా సినిమాలు ఇప్పుడు ఓటిటి దారే పడుతున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, భానుమతి రామకృష్ణ, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలు ఓటైటిల్లో విడుదల కావడమే కాదు.. మరికొన్ని సినిమాలు ఇప్పుడు ఓటిటి దారే పట్టబోతున్నాయి. అయితే ట్రెండ్ ని ఫాలో అయ్యే నాగ్ కూడా తన సినిమాలేమన్న ఓటిటి కి అమ్ముతాడేమో అని ఓటిటి వారు నాగ్ ని సంప్రదించారట. వైల్డ్ డాగ్, అఖిల్ మోస్ట్ బ్యాచిలర్ కోసం. కానీ నాగార్జున మాత్రం తనని సంప్రదించిన ఓటిటి వారిపై ఫైర్ అయ్యాడని తెలుస్తుంది. అసలే అఖిల్ మూడు ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు మూలిగే నక్కమీద తాటి టెంకలా అఖిల్ సినిమాని ఓటిటికి అమ్మేస్తే అఖిల్ క్రేజ్ మరింతగా దిగజారుతోంది. అందుకే ఓటిటి ప్రపోజల్ విషయమై నాగ్ కి కోపమొచ్చిందట. 

Tags:    

Similar News