బిగ్ బాస్ స్టేజ్ పై నాగ్ కామెడీ!

నాగార్జున బిగ్ బాస్ కి వచ్చే శని ఆదివారాల ఎపిసోడ్స్ కి బిగ్ బాస్ రేటింగ్ కూడా బావుంటుంది. మిగతా రోజులు డల్ గా ఉన్న బిగ్ [more]

Update: 2020-12-14 09:48 GMT

నాగార్జున బిగ్ బాస్ కి వచ్చే శని ఆదివారాల ఎపిసోడ్స్ కి బిగ్ బాస్ రేటింగ్ కూడా బావుంటుంది. మిగతా రోజులు డల్ గా ఉన్న బిగ్ బాస్ హౌస్ ఆ రెండు రోజులు కళకళలాడుతుంది. ఇక ఈ శనివారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ లో సోహైల్ కి అరియనాకి కలిపి గట్టి క్లాస్ ఇచ్చిన నాగార్జున కాస్త కామెడీ కూడా చేసాడు. అభిజిత్ ని కొన్ని పాయింట్స్ అడగాలంటూ నాగ్ బిగ్ బాస్ స్టేజ్ మీద కామెడీ చేసాడు.  ఇక సోహైల్ ని కుర్చీ మీద కూర్చున్నప్పుడు, టాస్క్ లో ఉన్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావ్ కానీ ఆటలో లేనప్పుడు ఎందుకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదంటూ కోప్పడగా.. అరియానని విమెన్ కార్డు ఎందుకు వాడవు అంటూ షాంపూ లేకుండానే తలంటేసాడు నాగార్జున. అరియనా అయితే ఏడుపుకి.. ఇంకేదో ఫీలింగ్ కి మధ్యన ఉండగా.. సోహైల్ అతి ఓవేరేక్షన్ చేసాడు. 

ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఈ వారం ఒక్కొక్కరిగా సేవ్ చెయ్యకుండా.. ఒక్కొక్కరిగా టాప్ ఫైవ్ కి తీస్కెళ్ళే ప్లాన్ లో భాగంగా అఖిల్ ముందే టికెట్ టు ఫినాలే తో టాప్ కి వెళ్లగా మిగిలిన ఐదుగురిలో ముందుగా సోహైల్ గత రాత్రి సేవ్ అయ్యి టాప్ 5 కి వెళ్లిన సెకండ్ కంటెస్టెంట్ గా నిలిచాడు. ఇక మధ్యలో నాగార్జున కామెడీ ఈ వారం ఎపిసోడ్ కే హైలెట్ అనేలా ఉంది. అభిజిత్ ని నాగ్ అభి పిల్లలెలా పుడతారు.. ఆ ప్రశ్న ని మోనాల్ ని అడిగావ్ కదా అని కామెడీ చెయ్యగా.. సర్ సర్ అంటూ అభి టెంక్షన్ అయ్యాడు. దానికి నాగార్జున మీమ్స్ చేసే వాళ్ళకి చక్కటి మీమ్ వేసుకొండి అంటూ పిల్లలెలా పుడతారంటే అంటూ.. ఏడుస్తూ పిల్లలు పుడతారంటూ నాగార్జున చేసిన కామెడీకి కంటెస్టెంట్స్ అందరూ ఫక్కున నవ్వగా.. అభిజిత్ అయితే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. 

Tags:    

Similar News