కామెడీ కావాలంటున్న సీనియర్ హీరో?

గత నాలుగైదు సినిమాల నుండి అక్కినేని నాగార్జున అట్టర్ ప్లాప్స్ కొడుతున్నాడు కానీ.. హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఈ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా ఉండే నాగార్జున సినిమాల [more]

Update: 2020-10-07 05:00 GMT

గత నాలుగైదు సినిమాల నుండి అక్కినేని నాగార్జున అట్టర్ ప్లాప్స్ కొడుతున్నాడు కానీ.. హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఈ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా ఉండే నాగార్జున సినిమాల విషయంలో కరెక్ట్ గా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడనిపిస్తుంది. అందుకే ఆఫీసర్, నమో వేంకటేశ, దేవదాస్, మన్మధుడు ఇలా ప్రతి సినిమా ప్లాప్ అవడంతో నాగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద కాస్త ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ మీదే ఆశలన్నీ. ఇక నాగార్జున డ్రీం ప్రాజెక్ట్ బంగార్రాజు సినిమాని పట్టాలెక్కించడానికి కూడా నాగ్ కి ధైర్యం చాలడం లేదు.

అయితే తాజాగా నాగార్జునకి కామెడీ మీద కన్ను పడింది అంటున్నారు. అయితే అఖిల్ తో అనుకున్న ఆ టాప్ కామెడీ డైరెక్టర్ ఇప్పుడు నాగార్జున కోసం కథ రెడీ చేసాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. అఖిల్ తో టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అనుకుంటే.. కాదు నాగార్జునతోనే అనిల్ రావిపూడి కొత్త సినిమా అంటున్నారు. వైల్డ్ డాగ్ పూర్తయ్యి ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్ కూడా పూర్తి కాగానే నాగార్జున అనిల్ రావిపూడి కమిట్మెంట్ ఇచ్చాడనే టాక్ మొదలయ్యింది. అనిల్ రావిపూడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటినుండి సక్సెస్ ఫుల్ కామెడీ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. అందుకే నాగార్జున కూడా అనిల్ తో సినిమా చేస్తే కామెడీ సినిమా చెయ్యాలని ఫిక్స్ అవడంతో అనిల్ రావిపూడి అలాంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ కథతో నాగ్ ని మెప్పించాడని అంటున్నారు. మరి అనిల్ కి ఎఫ్ 3 చేసేందుకు ఎలాగూ టైం పడుతుంది. ఈలోపు నాగార్జునని పర్ఫెక్ట్ గా మెప్పిస్తే.. తన సినిమానే ముందు మొదలెట్టొచ్చు అనే ఆలోచనలో ఉన్నాడట అనిల్.

Tags:    

Similar News