నాగ్ కి కోపమొచ్చింది.. అభి – హారిక వణికిపోయారు!!

శనివారం ఆదివారం బిగ్ బాస్ కి నాగార్జున వస్తున్నాడు అంటే బుల్లితెర ప్రేక్షకుల్లో ఒకింత ఉత్సాహం… గత వారం రోజులుగా బిగ్ బాస్ చూడలేక బుల్లితెర ప్రేక్షకులు [more]

Update: 2020-11-29 05:14 GMT

శనివారం ఆదివారం బిగ్ బాస్ కి నాగార్జున వస్తున్నాడు అంటే బుల్లితెర ప్రేక్షకుల్లో ఒకింత ఉత్సాహం… గత వారం రోజులుగా బిగ్ బాస్ చూడలేక బుల్లితెర ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి క్లాస్ లు, ఎవరికో అంక్షింతలు ఖాయం.. నాగార్జున చేతిలో క్లాస్ పీకించుకోవడానికి తప్పు చేసిన హౌస్ మేట్స్ అందరూ రెడీ అవ్వాల్సిందే. ఆదివారం ఎలిమినేషన్ తో ఫండే. ఇక శనివారం మాత్రం ఒక్కోసారి హౌస్ మేట్స్ మీద నాగ్ కి కోపం కూడా వస్తుంది. తాజాగా ఎప్పుడూ వెనకేసుకొచ్చే అభిజిత్ మీద నాగార్జునకి కోపం వచ్చింది. ప్రతివారం అభిజిత్ విషయంలో కోప్పడే నాగార్జున ఈసారి బాగా సీరియస్ అయ్యాడు. హారికాని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అభిజిత్ టాస్క్ చెయ్యకపోతే కెప్టెన్ గా నువ్వు చేయించాలి కదా అని అడిగితే.. దానికి హారిక, అభిజిత్ పర్సనల్ గా తీసుకున్నాడని చెప్పడంతో నాగ్ అభిజిత్ పై ఫైర్ అయ్యాడు. హరికకి ఫుల్ క్లాస్ ఇచ్సాడు.

ఇక అందరి తప్పులని ఎత్తి చూపిన నాగార్జున అభిజిత్ కి క్లాస్ పీకాడు. అభిజిత్, నేనూ అఖిల్ మోనాల్ ని ఏడిపించామని బిగ్ బాస్ చెప్పడం నాకు నచ్చలేదు అనగానే.. అవునా అంటూ నాగార్జున ఓ వీడియో ప్లే చేసి అభిజిత్ కి చూపించాడు. దానిలో మోనాల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు,, అభిజిత్ మోనాల్ ని ఏడిపించడం ఉంటుంది. దానితో నాగ్ నువ్వు మోనాల్ ఏడిపించిన విషయం తెలిసే బిగ్ బాస్ నీకు ఆ పనిష్మెంట్ ఇచ్చాడు అనగానే.. వెంటనే అభిజిత్ నాగ్ తో సారి అంటూ చెప్పినా.. నాగ్ సీరియస్ అవుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఇలా సారి చెబుతావ్ అభిజిత్ ప్రతి వారం ఇదే జరుగుతుంది అంటూ అభిజిత్ ని నెగటివ్ చెయ్యడమే కాదు… అభిజిత్ ని బయటికి వెళ్ళమన్నట్టుగా నాగార్జున బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అనడంతో అభి నాగార్జునకి సారి చెబుతూ షాకవడం, అలాగే కన్ఫెషన్ రూమ్ లో హారిక కూడా ఏడవలేక బయటికి రావడం, అభిజిత్ కోసం కాదు నీ కోసం నువ్వు ఆడు అంటూ హరికకి నాగ్ వార్నింగ్ ఇవ్వడం శనివారం షో మాములుగా లేదు.

Tags:    

Similar News