సిగరెట్ అలవాటు చేసుకున్న నభా నటేష్..!

Update: 2018-10-03 07:33 GMT

'నన్ను దోచుకుందువటే' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నభా నటేష్, రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. సిరి లాంటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తెగ అల్లరి చేసిన ఈ భామ ఓ సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతో నిజంగానే సిగరెట్ తాగిందంట. దాని వల్ల అన్నం కూడా సహించేది కాదని చెబుతుంది. పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి తాగాను కానీ లేకపోతే నాకు సిగిరెట్ అలవాటు లేదని చెబుతుంది. నిజానికి డైరెక్టర్ ఆలా చెప్పలేదట. సహజంగా నటించిన ఫీలింగ్ రావాలి అంటే పొగ తాగడమే కరెక్ట్ అని భావించి ఆ మేరకు పాత్రను పండించిందట. కన్నడలో శివ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన సినిమాలో నాభ నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇందులో ఇంట్రో సాంగ్ లో రవితేజ కూడా కనపడతాడు.

ప్రపోజల్స్ రాలేదు...

హీరోయిన్ అవ్వక ముందు హీరోయిన్ అయిన తర్వాత తనకు ఎటువంటి లవ్ ప్రపోజల్స్ రాలేదని దానికి కారణం ఏంటో తెలియదని చెబుతోంది. బహుశా కాలేజీ చదివే రోజుల్లో అబ్బాయిలా రఫ్ గా ఉండటంతో అంతా బ్రో అని పిలిచేవారని అందుకే ఎవరికీ ప్రేమించాలన్న ఫీలింగ్ కలగలేదేమో అని చెప్పింది. ప్రస్తుతం ఈమె తెలుగులో రవితేజ సరసన హీరోయిన్ గా నటించనుంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

Similar News