వాటిని అందుకోవడం సూర్య కి కష్టమే!!

Update: 2018-05-05 03:05 GMT

రామ్ చరణ్ రంగస్థలం తో కెరీర్ లో బెస్ట్ హిట్ కొట్టాడు. అలాగే రంగస్థలం కలెక్షన్స్ కూడా అదరగొట్టేశాయి. ఇక మరో హీరో మహేష్ బాబు భరత్ అనే నేను తో బంపర్ హిట్ కొట్టాడు. భరత్ కలెక్షన్స్ కూడా మాంచి జోరుమీదున్నాయి. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా నిన్న శుక్రవారమే నా పేరు సూర్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. వక్కంతం వంశి డైరెక్షన్ లో అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా చేసాడు. అయితే విడుదలై మొదటి షోకే అల్లు అర్జున్ నా పేరు సూర్య కి యావరేజ్ టాక్ వచ్చేసింది. కేవలం ప్రేక్షకులనుండే కాదు... క్రిటిక్స్ నుండి కూడా నా పేరు సూర్య కి యావరేజ్ మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో భారీ హిట్ అందుకుందామనుకున్న అల్లు అర్జున్ కి నా పేరు సూర్య దెబ్బేసింది.

పూర్తి నమ్మకంతో....

వక్కంత మీద పూర్తి నమ్మకంతో అల్లు అర్జున్ ఎంతో కాన్ఫిడెన్స్ తో సెట్స్ మీదకెళ్ళాడు. ఆర్మీ జవాన్ గా అల్లు అర్జున్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చాడు. అసలు నా పేరు సూర్య ని మొత్తం అల్లు అర్జున్ ఒంటి చేత్తో నడిపించాడు.. వక్కంత కి డైరెక్షన్లో అనుభవలేమి ఈ సినిమాలో స్పష్టం తెలుస్తుంది. ఒక్క అల్లు అర్జున్ పాత్ర తప్ప దేన్నీ హైలెట్ చెయ్యలేక వక్కంతం పడిన ఇబ్బంది అడుగడుగునా అర్ధమవుతుంది. అసలు ఎంతో కాలిక్యులేటెడ్ గా ఉండే బన్నీ ఇలాంటి కథని ఎందుకు యాక్సెప్ట్ చేసాడో అంటూ మెగా అభిమానులు మదనపడుతున్నారు.

అందుకే ఒప్పుకున్నాడా?

కేవలం ఈ సినిమాలో హీరోకున్న ఇంపార్టెన్స్ చూసే ఇలా అల్లు అర్జున్ ఈ సినిమాని ఒప్పుకున్నాడా అనే ఫీలింగ్ మాత్రం ప్రేక్షకులకు కలగక మానదు. మరి ఈ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని ఆశపడిన అల్లు అర్జున్ కి నిరాశ తప్పదు. మరి 85 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన నా పేరు సూర్య లాంగ్ రన్ లో ఆ ఫిగర్ ని టచ్ చెయ్యడం కష్టమనే అభిప్రాయాలూ స్టార్ట్ అవుతున్నాయి. మరి డీజే లా అల్లు అర్జున్ ఎమన్నా మ్యాజిక్ చేస్తే గనక నా పేరు సూర్య కి కలెక్షన్స్ వస్తాయి... కానీ డీజే జోనర్ వేరు, నా పేరు సూర్య జోనర్ వేరు. ఏది ఎలాగున్నా నా పేరు సూర్య తో అల్లు అర్జున్ కి గట్టిగా దెబ్బపడినట్లే.

Similar News