అల్లు అర్జున్ టార్గెట్ కొంచెం చిన్నదే

Update: 2018-05-02 08:28 GMT

ఈ సమ్మర్ కి వచ్చిన 'రంగస్థలం'.. 'భరత్ అనే నేను' రెండు సినిమాలు కమెర్షియల్ గా మంచి హిట్ అందుకున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ రెండు సినిమాలు వండర్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సమ్మర్ లో పెద్ద సినిమాల్లో రిలీజ్ అయ్యే చివరి సినిమా అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'.

ప్రస్తుత బన్నీ మార్కెట్ 70 కోట్లు ఉంది కానీ ఈసారి బన్నీ టార్గెట్ ఎనభై కోట్లు. 80 కోట్లు షేర్ వస్తే సక్సెస్‌ కింద లెక్క. మరి బన్నీ ఈ సినిమాతో అత్యధిక వసూళ్లు సాధించగలడా? కొత్త దర్శకుడుతో తాను అనుకున్న గోల్ రీచ్ అవ్వగలడా? అని సోషల్ మీడియాలో బన్నీ పై కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్స్ చూస్తే మినిమం గ్యారెంటీలానే అనిపిస్తున్నా కానీ ఒక సినిమా విజయానికి చాలా ఫ్యాక్టర్లు ఉంటాయి.

మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు 'రంగస్థలం'..'భరత్ అనే నేను' తో పాటు నా సినిమా హ్యాట్రిక్ కొడుతుంది అని చెప్పాడు. వరుసగా రెండు భారీ విజయాలు రావడం వల్ల మార్కెట్లో కాస్త స్తబ్ధత వచ్చే అవకాశముంది. మంచి టాక్ వస్తే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం 80 కోట్లు టార్గెట్ అంత కష్టమైనది ఏమి కాదు. కానీ సినిమాకు డివైడ్‌ టాక్‌ వస్తే మాత్రం టార్గెట్‌ క్లిష్టతరమవుతుంది. ఆల్రెడీ రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై ఈసారి ఒత్తిడి కాస్త ఎక్కువగానే వుంటుంది. అసలు భరత్ అనే నేను కలెక్షన్స్, రంగస్థలం కలెక్షన్స్ ముందు అల్లు అర్జున్ నా పేరు సూర్య 80 కోట్ల టార్గెట్ పెద్దదేమీ అనిపించడం లేదు. చూద్దాం మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది సినిమాలో ఎంత దమ్ము ఉందొ అనేది.

Similar News