సేమ్ టు సేమా ?

Update: 2018-05-05 08:54 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెల రోజుల గ్యాప్ తో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మహేష్ బాబు 'భరత్ అనే నేను' కాగా.. మరొకటి అల్లు అర్జున్ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమాలు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ వచ్చినప్పటికీ రెండు సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయ్. రెండు సినిమాల్లో హీరోలు సమాజంలో బాధ్యత కల వ్యక్తులే.

ఇద్దరూ సమాజం కోసం....

ఇద్దరు సమాజం కోసం ఏదో చేయాలనే భావనతో ఉన్నారు. 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ తను పని చేయడమే కాకుండా అందరు పని చేయాలనీ కోరుకునే వ్యక్తి. ఇక సూర్య కూడా దేశం కోసం దేశంలోని ప్రజలు కోసం ఏదైనా చేయడానికి వెనుకాడడు. అలాగే భరత్ ఎవరికైనా ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోవాలనే పంతం మీద ఉంటాడు. ఇక సూర్య.. మనిషికి క్యారెక్టర్ పోతే మనిషి ప్రాణాలు పోయినట్టే అని భావించే రకం. ఇద్దరిలోనూ సిన్సియారిటీ కనిపిస్తుంది.

కామిడీ లేకుండానే...

అయితే రెండు సినిమాల్లోనూ ఎక్కడ వెకిలి కామెడీ పెట్టకుండా జాగ్రత్త పడ్డారు డైరెక్టర్స్. ఎందుకంటే రెండు సినిమాల్లో జనాలకు ఏదో చెప్పాలని ట్రై చేశారు. సీరియస్ గా చెప్పే సీన్స్ కి మధ్య కామెడీ ట్రాక్ పెడితే వర్క్ అవుట్ అవ్వదు కాబట్టి. అయితే ఇప్పుడు అదే ఈ రెండు సినిమాలకి మైనస్ కావొచ్చు. ఎందుకంటే... సినిమాను మళ్లీ మళ్లీ చూసే ప్రేక్షకులు ఇలాంటి మూవీలకు తక్కువ ఉంటారు. సినిమాలు సీరియస్ గా ఉంటె ఒక్కసారి చూసి సరిపెట్టుకుంటారు ప్రేక్షకులు.

Similar News