సూర్య హడావిడేది!!

Update: 2018-05-04 04:07 GMT

ఏదన్న ఒక భారీ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది అంటేచాలు... ఆ రోజు ఉదయమే పలు ఛానల్స్ ఆ సినిమా థియేటర్స్ దగ్గర తెగ హడావిడి చేసి ప్రేక్షకులను పడేస్తాయి. ఒక భారీ సినిమా థియేటర్స్ లో విడుదలైన మరుక్షణమే ఛానల్స్ వారు అక్కడ ప్రత్యక్షమై భారీ హడావిడి మొదలుపెట్టడమే కాదు.. ఆయా హీరోల అభిమానులతో టాక్ అంటూ కెమెరాలు, మైకులతో పిచ్చెక్కించడమే కాదు.. ఛానల్స్ లో కూడా అది ప్రత్యక్ష ప్రసారం చేస్తూ హంగామా చేసేస్తాయి. పబ్లిక్ టాక్, ఫాన్స్ టాక్ అంటూ హోరెత్తిచడమే కాదు ఆ సినిమాలపై ప్రేక్షకులకు లేని ఆసక్తిని తీసుకొస్తాయి. మొన్నటికి మొన్న రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలప్పుడు ఛానల్స్ చేసిన హడావిడి మర్చిపోలేనిది.

కాని సూర్య విషయంలో...

కానీ ఇప్పుడు అల్లు అర్జున్ నా పేరు సూర్య విషయంలో ఛానల్స్ అన్ని సైలెంట్ అయ్యాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ - శ్రీ రెడ్డి ల విషయంలో పలు ఛానల్స్ చేసిన ఓవరేక్షన్ వలన కొన్ని ఛానల్స్ కి నా పేరు సూర్య యాడ్స్ ఆపేసారు. అందుకే ఆయా ఛానల్స్ లో నా పేరు సూర్య మాట ఎక్కడా వినబడడం లేదు. సినిమా విడుదల రోజు హడావిడి చేసే ఆయా ఛానల్స్ ఇప్పుడు నా పేరు సూర్య ని ఎక్కడా కవర్ చెయ్యడం కానీ... ఆ సినిమాపై హడావిడి చెయ్యడం గాని చెయ్యడం లేదు. అసలు పలు ఛానల్స్ లో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాపై పబ్లిసిటీ ఉందంటే నా పేరు సూర్య పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది.

ఎలా అధిగమిస్తాడో....

మరి నా పేరు సూర్య కి అసలే యుఎస్ ప్రీమియర్ టాక్ ఏమంత బాగోలేదు. మరి ఇప్పుడు కనీసం రోజూ టీవీలు చూసే ప్రేక్షకులకు నా పేరు సూర్య గురించిన సమాచారం సరిగ్గా చేరకపోతే నా పేరు సూర్య కి గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. మరి ఈ విపత్కర పరిస్థితిని అల్లు అర్జున్ నా పేరు సూర్య తో ఎలా అధిగమిస్తాడో చూద్దాం.

Similar News