ఆలు లేదు చూలు లేదు... అప్పుడే అంతా..!!

Update: 2018-05-06 08:50 GMT

'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సక్సెస్ ని షేర్ చేసుకునేందుకు ఆ సినిమా నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీషలు ప్రెస్ మీట్ పెట్టి తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. సాధారణంగా సినిమా బాగున్నా బాగోలేకపోయినా ప్రెస్ మీట్ పెట్టి తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం ప్రొడ్యూసర్స్ గా కనీస బాధ్యత. కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసినప్పుడు ప్రమోషన్ చేసుకుని తీరాలి.

రామాయణం, మహాభారతాలతో...

కాకపోతే అతిశయోక్తి లేకుండా చెప్పుకుంటేనే దేనికైనా విలువ ఉంటది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ... 'నా పేరు సూర్య' సినిమాను 'రామాయణం'.. 'మహాభారతం' లాంటి కావ్యాలతో పోల్చి వాటి తర్వాతే ఈ సినిమా అని చెప్పుకోవడం కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. కలియుగంలో మంచి సినిమా ఎప్పుడో ఒక్కసారి వస్తుందని ఈ యుగానికి 'నా పేరు సూర్య సినిమా అని చెప్పుకోవడం భజన మార్కు అనిపించాయి.

మొదటి రోజు 35కోట్లు....

అంతేకాకుండా తమిళనాడులో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమకు ఇటువంటి సినిమాలు ఎందుకు రావని అడిగారట. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను చూసిన వారు ప్రశంశలతో ఉక్కిరి బిక్కిరి చేసారట. సరే లగడపాటి చెప్పిన దాని ప్రకారం సినిమా అంతటి హిట్ అనుకుందాం. మరి ఓపెనింగ్స్ చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి లేదు. అలాగని ఈ సినిమా అంతటి దారుణమైన సినిమా అయితే కాదు. నాలుగు రోజులు ఆగి కలెక్షన్స్ అదేవిధంగా ఉంటే అప్పుడు నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిన వర్క్ అవుట్ అయ్యిది.. నమ్మేలా ఉండేది. కాని ముందే సక్సెస్ మీట్ అని పెట్టి మహాకావ్యాలతో పోల్చడం ఇవన్ని ఎందుకు అనిపిస్తోంది. మొదటి రోజు ఈ సినిమా 35 కోట్ల దాకా రాబట్టింది. రెండో రోజు పరిస్థితి ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News