విజయ్ - మురుగదాస్ కాంబోపై భారీ అంచనాలు!

Update: 2018-06-20 07:38 GMT

తేరి, మెర్సెల్ చిత్రాల విజయాలతో ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనకి... గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్ లో 62 వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. స్పైడర్ చిత్రం తో ఫ్లాప్ అందుకున్నా కూడా దర్శకుడు మురుగదాస్ - విజయ్ కాంబో మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చెన్నై, ఇతర ప్రాంతాల్లో 80 శాతం పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా మిగతా 20 శాతం చిత్రికరణని అమెరికా పరిసర ప్రాంతాల్లో జరుపుకోనుంది. ఇక అమెరికా షెడ్యూల్ కోసం అప్పుడే చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను మొదలెట్టేసింది.

రేపు ఫస్ట్ లుక్ రిలీజ్

మహానటి తో కోలీవుడ్, టాలీవుడ్ లో మంచి మార్కులు వేయించుకున్న కీర్తి సురేష్.. విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా... వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇప్పటివరకు అంటే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా టైటిల్ ని ఇంకా ఫైనల్ చెయ్యలేదు మురుగదాస్. అలాగే ఈ సినిమాలో విజయ్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడు అనే ఆసక్తి అందరిలో ఉంది. అందులోనూ విజయ్ అభిమానులైతే మరింత ఆసక్తితో ఉన్నారు. తమిళ సెంటిమెంట్ ఫెస్టివల్ దీపావళికి బరిలో ఉన్న ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని ఈ గురువారం సాయంత్రం విడుదల చేసేందుకు మురుగదాస్ రెడీ అవుతున్నాడు.

Similar News