బన్నీ ఓ భయంకరమైన నటుడంట

ఈమాటన్నది ఎవరో కాదు.. అలా వైకుంఠపురములో శాడిస్ట్ తండ్రిగా నటించిన మురళి శర్మ… చెప్పిన మాట. అల్లు అర్జున్ ఓ భయంకరమైననటుడు అంటున్నాడు. తాజాగా ఆయన ఓ [more]

Update: 2020-01-26 07:16 GMT

ఈమాటన్నది ఎవరో కాదు.. అలా వైకుంఠపురములో శాడిస్ట్ తండ్రిగా నటించిన మురళి శర్మ… చెప్పిన మాట. అల్లు అర్జున్ ఓ భయంకరమైననటుడు అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ అయినందుకు సంతోషం గా ఉందని, గతంలో త్రివిక్రమ్ సినిమాల్లో నటించినప్పుడు ఓ హాస్యభరితంగా చిత్రం చెయ్యాలని త్రివిక్రమ్ చెప్పారని అది అల వైకుంఠపురములో సినిమాతో తీరిందని చెబుతున్నాడు. తన కెరీర్ లోనే ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర ని అల వైకుంఠపురములో త్రివిక్రమ్ తనకి ఇచ్చాడని చెబుతున్నాడు. మరి ఆ సినిమాలో వాల్మీకి గా మురళీశర్మ నటనకు మంచి కాదు.. టాప్ మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ తర్వాత అంతగా పేరొచ్చింది కేవలం మురళి శర్మకే.

వాల్మీకి -బంటు(అల్లు అర్జున్) మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. మరి అల్లు అర్జున్ ఓ భయంకరమైన నటుడని, సెట్ లో స్టార్ హీరోలా అస్సలు ప్రవర్తించడని, తనకి ఇచ్చిన పాత్రలో పూర్తిగా లీనమవుతాడని చెబుతున్నాడు. మరి అల వైకుంఠపురములో శాడిస్ట్ తండ్రి వాల్మీకి గా మురళి శర్మ పాత్రని ఇప్పట్లో అయితే ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమా చెయ్యక ముందు గంట వాకింగ్ చేసే మురళి శర్మ ఈ సినిమా తర్వాత గంటన్నర వాకింగ్ చేస్తున్నాడట. కారణం తానూ వాకింగ్ చేస్తుంటే అందరూ ఆపి ఆల వైకుంఠపురములో సినిమా ముచ్చట్లే మాట్లాడుతున్నారట. అలాగే ఆ సినిమా తర్వాత తనకి ఫోన్ కాల్స్ కూడా ఎక్కువయ్యాయని అల ముచ్చట్లను అలా అలా చెబుతున్నాడు.

Tags:    

Similar News