సమంత సన్నగా ఉంది.. అలా బరువులెత్తుతుంటే.. షాకయ్యాడట!!

సమంత పెళ్లి కి ముందు, పెళ్లి తర్వాత కూడా సన్నగా గ్లామర్ గానే ఉంటుంది. కారణం ఎప్పుడూ జిమ్ లోనే ఉంటుంది. సమంత తిండి అయినా మానేస్తుంది [more]

Update: 2020-04-19 03:11 GMT

సమంత పెళ్లి కి ముందు, పెళ్లి తర్వాత కూడా సన్నగా గ్లామర్ గానే ఉంటుంది. కారణం ఎప్పుడూ జిమ్ లోనే ఉంటుంది. సమంత తిండి అయినా మానేస్తుంది కానీ.. జిమ్ మాత్రం మానదు. అయితే సమన్తా ఎప్పుడూ జిమ్ లో బరువులెత్తే వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. కానీ ఓ సీనియర్ నటుడు సమంత అలా సన్నగా ఉండి కూడా అంతంత బరువులెలా ఎత్తుతుందో అంటూ షాకయ్యాడట. ఆయనెవరో కాదు.. మురళి మోహన్. మురళి మోహన్ అన్ని వసతులతో హైదరాబాద్ లోని ఓ పోష్ ఏరియా 14 వ అంతస్తులో మూడు ముచ్చటైన ఇళ్ళని మురళి మోహన్ కట్టించుకున్నాడట. అన్ని అవసతులు అంటే స్విమ్మింగ్ ఫూల్ దగ్గరనుండి అన్ని అన్నమాట. ఆ ఇళ్ళు చూసిన నాగ చైతన్య… మురళి మోహన్ ని తనకి ఇల్లు అమ్మమ్మని అడిగాడట.

కానీ మురళి మోహన్ మాత్రం అమ్మను.. నా ఫ్యామిలీ కోసం కట్టించుకున్న అనగా.. చైతు తండ్రి నాగ్ తో మాట్లాడి మురళి మోహన్ ని ఒప్పించి ఆ ఇల్లు దక్కించుకున్నాడట. నాగ్ ఫోన్ వలనే నేను ఆ ఇల్లు అమ్మాను చైతూకి అని చెబుతున్నాడు. ఇక పక్కపక్కనే ఉంటున్న చైతు – సమంతలు తరచూ కలుస్తుండేవారని, పలకరించుకునేవారమని చెప్పిన మురళి మోహన్.. తాను జిమ్ చెయ్యడానికి వెళ్లగా.. అక్కడికి సమంత కూడా వచ్చి తనని పలకరించి జిమ్ చేసుకుంటుంటే.., అంత సన్నగా ఉన్న సమంత ఎలా అంత బరువు ఎత్తేస్తుంది అంటూ తాను షాకయినట్లుగా మురళీమోహన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. సమంత చాలా ప్రొఫెషనల్ అని, ఆమె చేసే కసరత్తులు ఎవరూ చెయ్యలేరంటూ సమంతని పొగిడేస్తున్నాడు.

Tags:    

Similar News