మిస్టర్ మజ్నుకి నెగటివ్ సెంటిమెంట్స్..!

అక్కినేని అఖిల్ కు మజ్ను సినిమా హిట్ చాలా అవసరం. ఇప్పటివరకు హిట్ నోచుకోని అఖిల్ ఈ సినిమా హిట్ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అయితే [more]

Update: 2019-01-23 07:36 GMT

అక్కినేని అఖిల్ కు మజ్ను సినిమా హిట్ చాలా అవసరం. ఇప్పటివరకు హిట్ నోచుకోని అఖిల్ ఈ సినిమా హిట్ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అయితే అఖిల్ కు కొన్ని పాజిటివ్ సెంటిమెంట్స్.. కొన్ని నెగటివ్ సెంటిమెంట్స్ అడ్డుపడుతున్నాయి. నెగటివ్ సెంటిమెంట్స్ విషయానికి వస్తే… ముఖ్యంగా మన టాలీవుడ్ వాళ్లు ఇటువంటి సెంటిమెంట్స్ నమ్ముతుంటారు. మన టాలీవుడ్ నుండి ఏదైనా బ్లాక్ బస్టర్ సినిమా వస్తే ఆ సినిమా తరువాత వచ్చే ఏ సినిమా అయినా తలవంచుకుంటూ పక్కకు వెళ్లిపోతాయి. ఇటువంటివి చాలాసార్లు జరిగాయి. ఆడితే మాత్రం ఒక రేంజ్ లో ఆడతాయి. రంగస్థలం కావచ్చు, గీత గోవిందం కావచ్చు, ఇంకా చాలా హిట్ సినిమాలు ఇదే బాపతు.

టైటిల్ రిపీట్ చేయడంతో…

మరో సెంటిమెంట్ ఏంటంటే డైరెక్టర్ కు రెండో సినిమా ప్లాప్ అవ్వడం. మన తెలుగులో రెండో సినిమా గండం దాటిన డైరక్టర్లు ఓ పదిశాతం ఉంటారంతే. ఇంకో సెంటిమెంట్ హీరోయిన్ నిధి అగర్వాల్. చైతుతో నిధి అగర్వాల్ నటించి డిజాస్టర్ ఇచ్చింది. మరి తమ్ముడు అఖిల్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి. ఇక పాజిటివ్ సెంటిమెంట్స్ కు వస్తే డైరెక్టర్ వెంకీ అట్లూరి తీసిన మొదటి సినిమాకి తొలిప్రేమ టైటిల్ రిపీట్ చేసి హిట్ కొట్టాడు. అలానే ఇప్పుడు మజ్ను టైటిల్ రిపీట్ చేస్తున్నాడు. సో ఇదొకటి పాజిటివ్ వైబ్. ఇటువంటి సెంటిమెంట్స్ ఎలా ఉన్నా అఖిల్ కి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని సమాచారం. జనవరి 25న వస్తున్న ఈ సినిమా అఖిల్ భవిషత్తు మారుస్తుందేమో చూద్దాం.

Tags:    

Similar News