ప్రమోషన్ లేకుండా రిలీజ్ ఏంటి భయ్యా?

ఏ సినిమా అయినా థియేటర్స్ లో విడుదలవుతుంది అంటే సినిమా టీం లోని దర్శకనిర్మాతలు, హీరో హీరోయిన్స్ టెక్నీషియన్స్ అంతా ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ టూర్స్, [more]

Update: 2020-06-26 07:41 GMT

ఏ సినిమా అయినా థియేటర్స్ లో విడుదలవుతుంది అంటే సినిమా టీం లోని దర్శకనిర్మాతలు, హీరో హీరోయిన్స్ టెక్నీషియన్స్ అంతా ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ టూర్స్, ఇంటర్వూస్ అంటూ సినిమాని ప్రమోట్ చేసి విడుదల చేస్తారు. ఎందుకూ ప్రేక్షకులకు తమ సినిమా విడుదలవుతుంది అని తెలియడానికి. ఇక థియేటర్స్ మాత్రమే కాదు.. ప్రస్తుతం కరోనా పరిస్థితి వలన ఓటిటిలో విడుదలయ్యే సినిమాలకు మంచి ప్రమోషన్ ఉండాల్సిందే. అసలు థియేటర్స్ కన్నా ఎక్కువగా ఓటిటి ప్రమోషన్ ఉండాలి. లేదంటే ఆ సినిమాని ఎప్పుడు ఓటిటిలో పెడతారో…. అసలా సినిమా ఏమిటో అనేది ఎవ్వరికి తెలియదు. తాజాగా కృష్ణ అండ్ హిస్ లీల సినిమాని నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు.. గతనాలుగు రోజులుగా ఆ సినిమాని త్వరలోనే విడుదల టూ పోస్టర్స్ తో పాటుగా… టీజర్, ట్రైలర్ విడుదల చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు.

రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఆ చిన్న సినిమా కృష్ణ అండ్ హిస్ లీల సినిమా విషయాలను పంచుకుంటున్నాడు తప్ప.. ఆ సినిమా ఎప్పుడు విడుదవుతుందో అనేది చెప్పలేదు. కానీ గత రాత్రి అంటే బుధవారం రాత్రి 12 గంటలకు ఈ కృష్ణ అండ్ హిస్ లీల సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు సైలెంట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్క్ లో విడుదల చేసేసారు. అసలు ఆ సినిమా ఉంది అని తెలిసిందే నాలుగు రోజుల క్రితం. అలాంటిది ఎలాంటి ప్రమోషన్ లేకుండా సినిమాని విడుదల చెయ్యడం.. అది స్ట్రీమ్ అవడం చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు. థియేటర్స్ అయినా ఓటిటి అయినా ప్రమోషస్న్ తో విడుదల చేస్తే ఆ సినిమాకి రివ్యూస్ రాసి ఆ సినిమాపై అందరిలో ఆసక్తి పెంచుతారు వెబ్ సైట్ వాళ్ళు. కానీ చడీ చప్పుడు లేని సినిమాకి ఎలాంటి రివ్యూస్ ఉండవు. అలాగే ఆ సినిమా ప్రేక్షకుల దగ్గరికి చేరదు. మరి ఈ విషయాన్నీ అమెజాన్ కన్నా వెనకబడి ఉన్న నెట్ ఫ్లిక్క్ వాళ్ళు ఒప్పుకున్నారో వాళ్ళకే తెలియాలి.

Tags:    

Similar News