జులై నుండి పరుగులు పెట్టడం ఖాయం!!

కరోనా లాక్ డౌన్ తో ఓటిటి ల హావ బాగా పెరిగింది ప్రస్తుతం బుల్లితెర మీద కూడా కొత్త ప్రోగ్రామ్స్ లేకపోవడం, థియేటర్స్ బంద్ ఉండడంతో.. ప్రేక్షకులంతా [more]

Update: 2020-06-28 02:37 GMT

కరోనా లాక్ డౌన్ తో ఓటిటి ల హావ బాగా పెరిగింది ప్రస్తుతం బుల్లితెర మీద కూడా కొత్త ప్రోగ్రామ్స్ లేకపోవడం, థియేటర్స్ బంద్ ఉండడంతో.. ప్రేక్షకులంతా ఓటిటి ల మీద పడ్డారు. అందుకే ఓటిటి యాజమాన్యాలు కూడా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ని క్యాష్ చేసుకునే పనిలో సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేసే ప్లాన్స్ తో ముందుకు సాగుతున్నారు. మీడియం, చిన్ననిర్మాతలకు గాలం వేస్తున్నారు. గాలానికి చిక్కిన సినిమాలని ఓటిటిలో విడుదల చేసుకుంటూ వస్తున్నారు. అందుకే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు ప్రముఖంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు 10 సినిమాలకు పైగా ఓటిటీలలోనే విడుదలయ్యాయి. నిన్నమొన్నటివరకు ఓటిటిలో ఏ సినిమా హిట్ అవ్వకపోయిన… మోనా గురువారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలయిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో ఫస్ట్ ఓటిటి హిట్ పడింది.

అయితే ఇప్పవరకు మా సినిమాలు థియేటర్స్లోనే కానీ.. ఓటిటిలో విడుదల చేయమంటూ కంకణం కట్టుకుని కూర్చున్న వారు ఇప్పుడు దిగొచ్చేలా కనబడుతున్నారు. థియేటర్స్ ఆగష్టు లో తెరుచుకుంటాయనే టాక్ ఉంది. అప్పుడయినా తెరుచుకుంటాయో లేదో అనే అనుమానము ఉంది. అందుకే చాలామంది అంటే నిన్నటివరకు మాది కట్టుకున్న వారు ఇప్పుడు ఓటిటి అయినా పర్లేదు అనే స్థాయికి వచ్చేసారని.. ఇక మీదట అంటే జులై నుండే చిన్న, మీడియం సినిమాల తాకిడి ఓఐటీలలో మొదలు కాబోతుంది అని అంటున్నారు. ఆగష్టు నుండి థియేటర్స్ మాటేమిటో కానీ… ప్రస్తుతం తమ సినిమాలను మంచి ప్రమోషన్స్ తో ఓటిటిలో విడుదల చేసేద్దామని నిర్ణయంలో చాలామంది ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News