ఎక్కడా తగ్గనంటుంది!

ఒకప్పుడు మోనాల్ గజ్జర్ అంటే అల్లరి నరేష్ హీరోయిన్. కానీ ఇప్పుడు మోనాల్ అంటే బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ. బిగ్ బాస్ సీజన్ 4 లో [more]

Update: 2020-12-19 10:32 GMT

ఒకప్పుడు మోనాల్ గజ్జర్ అంటే అల్లరి నరేష్ హీరోయిన్. కానీ ఇప్పుడు మోనాల్ అంటే బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ. బిగ్ బాస్ సీజన్ 4 లో కేవలం గ్లామర్ షో తోనూ 14 వారాలు హౌస్ లో ఉన్న మోనాల్ గజ్జర్ ను 14 వ వారంలో ఎలిమినేట్ చేసి నీ వల్ల ఇక హౌస్ కి ఎలాంటి ఉపయోగం లేదని బయటికి పంపేశారు. ప్రేక్షకులు. అయితే ఐదారు వారాలకే మోనాల్ ని బయటికి పంపాలని డిసైడ్ అయినా మోనాల్ గ్లామర్ షో మోనాల్ ని కాపాడుతూ వచ్చింది. ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక మోనాల్ హైదరాబాద్ ని వదల్లేదు. గుజరాతి అమ్మాయిగా బిగ్ బాస్ హౌస్ లో అందరికి పరిచయమైన మోనాల్.. ఫినాలే ఎపిసోడ్ కోసం ఇంకా హైదరాబాద్ లోనే ఉంది.

అయితే హౌస్ నుండి బయటికొచ్చాక కూడా మోనాల్ ఎక్కడా తగ్గనంటుంది. గ్లామర్ షో మరింతగా పెంచేసింది. హౌస్ రీ యూనియన్ పార్టీ కోసం మల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మోనాల్ గ్లామర్ షో మరింతగా ఎక్కువైందనిపిస్తుంది. క్లివేజ్ షో తో మోనాల్ బిగ్ బాస్ రీ ఎంట్రీ దడదడలాడింది. డిజైనర్ వెర్ డ్రెస్ లో మోనాల్ అందాల ఆరబోత మాములుగా లేదు. బిగ్ బాస్ హౌస్ క్రేజ్ తో మోనాల్ అందాలకు పడిపోయే దర్శకనిర్మాతలెవరైనా మోనాల్ కి సినిమా అవకాశాలు ఇచ్చిన ఇవ్వోచ్చేమో.. అంతలా మోనాల్ అందాల ప్రదర్శన ఉంది.

Tags:    

Similar News