మోనాల్ గ్లామర్ నిజంగా ప్లస్సే!

నిజంగా చాలామంది హీరోయిన్స్ గ్లామర్ షో చేస్తే కెరీర్ లో సెటిల్ అవుతారు. కొంతమంది ఎంత చూపించినా కెరీర్ లో సెటిల్ కాలేరు. ఒకప్పుడు అల్లరి నరేష్ [more]

Update: 2020-12-28 07:17 GMT

నిజంగా చాలామంది హీరోయిన్స్ గ్లామర్ షో చేస్తే కెరీర్ లో సెటిల్ అవుతారు. కొంతమంది ఎంత చూపించినా కెరీర్ లో సెటిల్ కాలేరు. ఒకప్పుడు అల్లరి నరేష్ తో రెండు సినిమాలు చేసి.. లైం టైం లో లేకుండా పోయిన మోనాల్ గజ్జర్ ప్రస్తుతం గ్లామర్ షో ద్వారానే కెరీర్ లో సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. అల్లరి నరెష్ తో చేసిన సినిమాలతో ఫెమ్ తెచ్చుకోలేని మోనాల్ బిగ్ బాస్ లోకి ఆడుగుపెట్టి గ్లామర్ షో చేస్తూ తెగ ఫెమస్ అయ్యింది. మోనాల్ గజ్జర్ ని కేవలం గ్లామర్ కోసమే స్టార్ మా బిగ్ బాస్ యాజమాన్యం 14 వారాల పటు బిగ్ బాస్ హౌస్ లో ఉంచారు. లేదంటే మోనాల్ ఐదారు వారాలకే ఎలిమినేట్ అయ్యిపోయేది. వారం వారం నాగ్ ఎపిసోడ్స్ లో మోనాల్ గజ్జర్ గ్లామర్ షో ఆమెని హౌస్ లో 14 వారాల పాటు ఉండేలా చేసింది.

ఈ గ్లామర్ కోసమే మోనాల్ కి స్టార్ మా మళ్ళీ అవకాశం ఇచ్చింది. 14 వ వారంలో అంటే చివరి వారం వరకు మోనాల్ గ్లామర్ ని వాడిన స్టార్ మా మళ్లీ డాన్స్ ప్లస్ తో మోనాల్ గ్లామర్ ని వాడేస్తుంది. మోనాల్ గజ్జర్ గ్లామర్ తారగా డాన్స్ ప్లస్ షో లో మెంటర్ స్థానంలో అదరగొట్టేస్తుంది. ఓం కార్ అన్నయ్యతో, బాబా భాస్కర్ మాస్టర్ తో పంచ్ లు వేస్తూ మోనాల్ గజ్జర్ డాన్స్ ప్లస్ స్టేజి మీద హడావిడి చేస్తుంది. బిగ్ బాస్ లో మోనాల్ వలన స్టార్ మాకి వచ్చిన తలనొప్పులు అన్ని ఇన్ని కావు.  స్టార్ కి బిగ్ బాస్ కి దత్త పుత్రిక మోనాల్ అన్నాసరే స్టార్ మా పట్టించుకోలేదు. తాజాగా బిగ్ బాస్ లో మోనాల్ గ్లామర్ వాడింది చాలదు.. మళ్ళీ కావాలి అంటూ డాన్స్ ప్లస్ కోసం మోనాల్ ని తీసుకొచ్చారు. తాజాగా డాన్స్ ప్లస్ షో లో మోనాల్ స్టేజ్ పెరఫార్మెన్స్ గ్లామర్ షో తో కళకళ్ళాడింది. యాని మాస్టర్, యశ్ మాస్టర్, బాబా భాస్కర్ లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళు కేవలం డాన్స్ కి మాత్రమే హెల్ప్ అవుతారు కానీ.. గ్లామర్ విషయంలో డాన్స్ ప్లస్ కి నిజంగా హెల్ప్ అయ్యేది మాత్రం మోనాల్ అనే చెప్పాలి.

Tags:    

Similar News