బాబోయ్ ఆ ఏడుపు సుందరి మాకొద్దు!!

బిగ్ బాస్ 4 లో ఏడుపులు ఆకాశాన్ని తాకాయి. కంటెస్టెంట్స్ చిన్ననాటి ఫొటోస్ తో ఎమోషన్ కి తెర లేపిన బిగ్ బాస్ వాళ్ళ ఏడుపులతో హౌస్ [more]

Update: 2020-10-17 07:49 GMT

బిగ్ బాస్ 4 లో ఏడుపులు ఆకాశాన్ని తాకాయి. కంటెస్టెంట్స్ చిన్ననాటి ఫొటోస్ తో ఎమోషన్ కి తెర లేపిన బిగ్ బాస్ వాళ్ళ ఏడుపులతో హౌస్ మొత్తం డల్ అయ్యింది. కామెడీ కొరవడిన బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఏడుపులు పేద బొబ్బలు అన్ని భీభత్సంగా ఉన్నాయి. ఇక హీరోయిన్ మోనాల్ గజ్జర్ అయితే ఉంటే అఖిల్ లేదంటే అభిలతో ఉంటుంది. లేదు అంటే ఏడవడం తప్ప ఆమె చేసేది లేదు. అసలు మోనాల్ ఏడుపు చూస్తే బుల్లితెర ప్రేక్షకులకు చిరాకు వచ్చేస్తుంది. కారణంగా లేకుండానే కళ్ళ నీళ్లు పెట్టుకునే మోనాల్ ని చూడడానికి ప్రేక్షకుల్లో విసుగు వచ్చేసింది. అందుకే ఈ ఏడుపు సుందరి మాకొద్దు అంటున్నారట ప్రేక్షకులు.

ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న మోనాల్ ని బయటికి పంపేందుకు బుల్లితెర ప్రేక్షకులు రెడీ అయినా.. బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం మోనాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని హైలెట్ చేస్తూ ఆమెకి దాదాపుగా 50 శాతం స్క్రీన్ స్పేస్ ఇచ్చేస్తుంది. మోనాల్ గజ్జర్ అఖిల్ – అభిలతో ఆడుకుంటుంది. అదే ఎక్కువగా బిగ్ బాస్ ఎక్సపోజ్ చేస్తుంది. అలాగే ఆమె ఏడవడం హైలెట్ చేస్తుంది. మరి ప్రేక్షకులు బయటకి పంపాలనుకున్నా బిగ్ బాస్ మాత్రం మోనాల్ ని సేవ్ చేసి ఆమె ప్రేమాయణంతో  బిగ్ బాస్ కి క్రేజ్ తేవాలని డిసైడ్ అయ్యింది అనే టాక్ వినిపిస్తుంది. కానీ ప్రేక్షకులు మాత్రం మోనాల్ ఏడుపు బోర్ కొట్టేసిందిగా అంటున్నారు. అన్నట్టు ఈ వారం నామినేషన్స్ లో ఇంటి సభ్యుల్లో ఎవరు బయటికి వెళతారు అనేది సస్పెన్స్  గా కనబడుతుంది.

Tags:    

Similar News