మోనాల్ ఇంత పెద్ద షాకిచ్చేందేమిటి!!

బిగ్ బాస్ సీజన్ 4 లో అర్హతలేని కంటెస్టెంట్ ని బిగ్ బాస్ వెనకేసుకొస్తున్నాడు, ఆ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ కాపాడుతున్నాడు అంటూ.. మోనాల్ గజ్జర్ [more]

Update: 2020-11-24 07:12 GMT

బిగ్ బాస్ సీజన్ 4 లో అర్హతలేని కంటెస్టెంట్ ని బిగ్ బాస్ వెనకేసుకొస్తున్నాడు, ఆ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ కాపాడుతున్నాడు అంటూ.. మోనాల్ గజ్జర్ విషయంలో సోషల్ మీడియాలో బిగ్ బాస్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. కానీ గత రెండు వారాలుగా మోనాల్ ఆటలో చాలా తేడా.. ఇప్పుడు ఈ రెండు వారాలుగా మోనాల్ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అట మొదలైనప్పటినుండి మోనాల్ కోసం అఖిల్, అఖిల్ కోసం మోనాల్ స్టాండ్ తీసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ గత వారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో అఖిల్ మోనాల్ ఫై కోపం తెచ్చుకోవడం, మమ్మి చెప్పిందని మోనాల్ తో దూరంగా ఉండడం చేస్తున్నాడు. ఆ విషయంలో మోనాల్ గట్టిగానె హార్ట్ అయ్యింది.

అయితే ఈ సోమవారం నామినేషన్స్ లో మోనాల్ అఖిల్ కి మరిచిపోలేని షాకిచ్చింది. ఈ వారం నామినేషన్స్ విషయంలో హౌస్ మేట్స్ తెలీకుండా పెట్టుకున్న ఎర్ర టోపీతో ఎలిమినేషన్స్ లోకి వెళ్లగా.. అందులో అఖిల్, అభిజిత్, అరియనా, అవినాష్ లు ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఆ నలుగురిని మీరు హౌసులో ఎందుకు ఉండాలనుకుంటున్నారో చెప్పి మీరు వేరే వాళ్ళుతో స్వాప్ చేసుకోవచ్చని అనగానే అవినాష్ మోనాల్ ని రిక్వెస్ట్ చెయ్యగా.. మోనాల్ అవినాష్ కి మీరు హౌస్ లో ఉండి గట్టిగా ఆడండి అంటూ గట్టిగానే చెప్పింది. ఇక అఖిల్ కూడా మోనాల్ ని రిక్వెస్ట్ చేసి..అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నావ్ అంటున్నారు.. కానీ ఎక్కడ? అని మోనాల్ ని తనతో స్వాప్ చేసుకోమని అడిగాడు . కానీ మోనాల్ అఖిల్ కాదని అభిజిత్ ని స్వాప్ చేసుకుంది. దానితో అఖిల్ ఫేస్ ఎర్రగా దోశలా మాడిపోయింది.

Tags:    

Similar News