సూర్య పక్కన మన సీనియర్ హీరో!

Update: 2018-08-29 09:58 GMT

ఈమధ్య కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు. మరి ఆయనకి తగ్గ పాత్రలు రావట్లేదో..లేక ఆయనే వద్దు అనుకుంటున్నాడో అర్ధం కాట్లేదు. అయితే ఇది ఇలా ఉండగా ఆయన ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారని ఓ రుమౌర్ బయటికి వచ్చింది. గతంలో ఆయన విలనీ పాత్రలు చాలానే చేశాడు. కానీ గత కొంత కాలం నుండి ఆయన అటువంటి పాత్రలు చేయట్లేదు. రీసెంట్ గా ఆయన 'రౌడీ' సినిమాతో విలన్ షేడ్ కు దగ్గరగా వుండే గంభీరమైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆయనను తమిళ స్టార్ హీరో సూర్య అడిగారట.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని......

తన మూవీలో మెయిన్ విలన్ పాత్ర కోసం సూర్య అడిగారట. మరి అందుకు మోహన్ బాబు ఎస్ చెప్పాడో నో చెప్పాడో తెలియాల్సిఉంది. కానీ కోలీవుడ్ సమాచారం మోహన్ బాబు ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాను 'గురు' సినిమా ఫేమ్ సుధ కొంగర డైరెక్ట్ చేయనుంది. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా చెప్పాల్సిఉంది.

Similar News