బ్రేకింగ్: ఆ కేసులో మోహన్ బాబుకు జైలు

చెక్ బౌన్స్ కేసులో నటుడు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. మంచు విష్ణు హీరోగా సలీం సినిమా చేసిన దర్శకుడు వైవిఎస్ చౌదరికి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ [more]

Update: 2019-04-02 08:19 GMT

చెక్ బౌన్స్ కేసులో నటుడు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. మంచు విష్ణు హీరోగా సలీం సినిమా చేసిన దర్శకుడు వైవిఎస్ చౌదరికి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నుండి ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో ఆయన మోహన్ బాబుపై 2010లో కేసు వేసాడు. సలీం సినిమా హిట్ అవకపోవడంతో వైవిఎస్ కి ఇవ్వాల్సిన కొంత అమౌంట్ చెక్ రూపంలో మోహన్ బాబు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పేరు మీద వైవిఎస్ కి ఇవ్వగా.. ఆ చెక్ బౌన్స్ అవడంతో వైవిఎస్ కేసు పెట్టాడు. అప్పటినుండి ఎర్రమంజిల్ కోర్టులో ఈ చెక్ బౌన్స్ కేసు పెండింగ్ లో ఉంది. మధ్యలో మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఈ కేసు విషయంలో ఎర్రమంజిల్ కోర్టుకి హాజరయ్యారు.

ఏడాది జైలు శిక్ష

అయితే అప్పటి నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ కేసు విషయంలో ఇవాళ ఎర్రమంజిల్ కోర్టు తుది తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో లక్ష్మిప్రసన్న పిక్చర్స్ ని A1 ముద్దాయిగా, మోహన్ బాబుని A2 ముద్దాయిగా చేర్చారు పోలీసులు. ఇక నేడు మోహన్ బాబు తన చిన్న కుమారుడు మనోజ్ తో కలిసి ఎర్రమంజిల్ కోర్టుకి హాజరయ్యారు. ఇక ఈ కేసులో మోహన్ బాబుకి ఒక ఏడాది జైలు శిక్షని, రూ.41.75 లక్షల జరిమానాని కోర్టు విధించింది.

Tags:    

Similar News