మెహ్రీన్ ఛాన్స్ కొట్టేసిన కళ్యాణి!!

Update: 2018-04-14 06:00 GMT

ఛలో' సినిమాతో నాగసౌర్య మార్కెట్ బాగా పెరిగింది. అలాగే నాగశౌర్య 'ఛలో' సినిమా తర్వాత తన సొంత బ్యానర్ లోనే 'నర్తనశాల' అనే సినిమా చేస్తున్నాడు. చక్రవర్తి అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న నాగశౌర్య కి ఈమధ్యన కాస్త ఎక్కువైందని టాక్ బయట నడుస్తుంది. ఎందుకంటే తమిళంలో నాగశౌర్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన 'కణం' సినిమా టైం లో సాయి పల్లవి విషయంలో ఓపెన్ గానే ఫైర్ అయ్యాడు. సాయి పల్లవి వలన తాను ఇబ్బంది పడినట్లు మీడియాతో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రైటర్ కోన వెంకట్ విషయంలోనూ నాగశౌర్యపై కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా తన సినిమాకి అనుకున్న హీరోయిన్ ని తప్పించి మరో హీరోయిన్ ని లాస్ట్ మినిట్ లో ఫైనల్ చేసాడంటున్నారు.

మెహ్రీన్ నుతప్పించి.....

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు... ఈమధ్యనే 'రాజా ది గ్రేట్' తో హిట్ అందుకున్న మెహ్రీన్ కౌర్. మెహ్రీన్ బొద్దుగా ముద్దుగా ఉండంతో ఆమెకి ఈమధ్యన కాస్త ఆఫర్స్ తగ్గాయి. కానీ ప్రస్తుతం మెహ్రీన్ జిమ్ లో బాగా కష్టపడి సన్నబడడానికి ట్రై చేస్తుంది. అయితే నాగశౌర్య తన సినిమా 'నర్తనశాల' ఓపెనింగ్ రోజున మెహ్రీన్ కౌర్ ని తన సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామనుకున్నాడట. అలాగే తరవాత ఆమె పేరుని అధికారికంగా ప్రకటించేలోపు మెహ్రీన్ ని తప్పించి 'హలో' ఫేమ్ కళ్యాణి ని తీసుకున్నాడట. మరి ఓన్ బ్యానర్ కావడం, దర్శకుడు కొత్తవాడు కావడం తో నాగశౌర్య హీరోయిన్ విషయంలో ఏది చెబితే అదే ఫైనల్ అంటున్నారట.

కల్యాణికి రెండు ఆఫర్లు...

అయితే మెహ్రీన్ ని ఏ కారణంగా తప్పించారో కానీ... ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందా అనేది మాత్రం క్లారిటీ లేదు. కాకపోతే 'హలో' ఫెమ్ కళ్యాణి ప్రస్తుతానికి శర్వానంద్ సినిమాలో నటిస్తుంది. ఇక ఇప్పుడు మెహ్రీన్ ఆఫర్ ని కళ్యాణి తన్నుకుపోయింది. సో అలా కల్యాణికి టాలీవుడ్ లో రెండు అవకాశాలు వచ్చాయన్నమాట.

Similar News