మెహ్రీన్ కి మూడిందా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో మెహ్రీన్ కి మూడింది అనే మాట మాత్రం బాగా వినబడుతుంది. మొన్నటికిమొన్న పారితోషకం విషయంలో మెహ్రీన్ పై ఫైర్ అయిన ఒక నిర్మాత ఏకంగా [more]

Update: 2018-12-27 06:32 GMT

ప్రస్తుతం ఇండస్ట్రీలో మెహ్రీన్ కి మూడింది అనే మాట మాత్రం బాగా వినబడుతుంది. మొన్నటికిమొన్న పారితోషకం విషయంలో మెహ్రీన్ పై ఫైర్ అయిన ఒక నిర్మాత ఏకంగా ఫిలిం ఛాంబర్ లో మెహ్రీన్ పై కంప్లంయింట్ చేశాడు. అసలే సినిమాల ప్లాప్స్ తో కష్టాల్లో ఉన్న మెహ్రీన్ కి ఇప్పుడు సినిమా కష్టాలంటారే… అలా కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ మెహ్రీన్ సినిమా కష్టాలంటే… మెహ్రీన్ కి ఎఫ్ 2 తర్వాత ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. కారణం మెహ్రీన్ కి లక్కు లేకో… మారేదన్నానో కాదు… ఆమెకి ఆఫర్స్ ఇవ్వొద్దని హీరోలు,దర్శక నిర్మాతల మీద ఒత్తిడి తేవడంతోనే మెహ్రీన్ చేతిలో ఫ్యూచర్ ప్రాజెక్టులు లేకపావడానికి కారణమట.

షూటింగ్ లకు సహకరించకుండా….

ఇంతకీ హీరోలకు మెహ్రీన్ మీద ఎందుకు మండింది అంటే… మెహ్రీన్ చేసిన సినిమాల్లో హీరోలకు షూటింగ్ విషయంలో సహకరించకుండా.. కాస్త బెట్టు చేసేదని… దర్శకనిర్మాతలకు పెట్టే కండీషన్స్ , అలాగే సెట్స్ లో హీరోలకు కనీస మర్యాద ఇవ్వకుండా పొగరు చూపించడంతో… ఆమెతో సినిమాలు చేసిన హీరోలు మరొక అవకాశం ఆమెకి ఇచ్చేది లేదని.. డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి టాప్ హీరోయిన్స్ కూడా సినిమా షూటింగ్స్ లో డీసెంట్ గా ఉంది.. తమ పని తాము చేసుకుని అవకాశాల మీద అవకాశాలు పడుతుంటే.. చేతిలో సినిమాలు అంతంత మాత్రంగా ఉంది… అదృష్టం కలిసిరాక ఒక్క బ్లాక్ బస్టర్ కొట్టని మెహ్రీన్ కి ఇంత పొగరు అవసరమా? అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఏమైనా ఎఫ్ టు తర్వాత మెహ్రీన్ కి ఒక్క అవకాశము లేదు. మరి ఇంతకుముందే కవచం ప్రమోషన్స్ విషయంలో కాజల్ కి మెహ్రీన్ కి మధ్య గొడవ జరగడంతోనే కవచం ప్రమోషన్స్ లో మెహ్రీన్ కనబడలేదని న్యూస్ తో పాటుగా.. రెమ్యునరేషన్ విషయంలో మెహ్రీన్ ప్రవర్తన, లేటెస్ట్ గా హీరోల పట్ల మెహ్రీన్ ప్రవర్తన వింటుంటే.. మెహ్రీన్ ఇక తట్టా బుట్టా సర్దుకోవాలేమో అన్నట్లుగా ఉంది.

Tags:    

Similar News